పేద మహిళ వైద్య పరీక్షలకు కాస్మోపాలిటన్‌ క్లబ్‌ సహాయం

0
47

రాజమహేంద్రవరం, జనవరి 10 : క్రీడలకు చేయూతనిస్తూ వివిధ ఆటల పోటీలను నిర్వహిస్తున్న ది కాస్మోపాలిటన్‌ క్లబ్‌ ఇప్పుడు సామాజిక సేవా కార్యక్రమాల వైపు ద ష్టి సారించింది. అందులో భాగంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న శేషయ్యమెట్టకు చెందిన మహ్మద్‌ భాను అనే మైనారిటీ మహిళకు వైద్య పరీక్షల నిమిత్తం రూ.7,500లను క్లబ్‌ కార్యదర్శి పరిమి శ్రీనివాస్‌ (వాసు) అందజేసారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ కాస్మోపాలిటన్‌ క్లబ్‌ ద్వారా అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడమే కాకుండా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సంసిద్దంగా ఉన్నామని తెలిపారు.ఇటీవలే రాష్ట్ర స్ధాయి షటిల్‌, బిలియర్డ్స్‌, స్నూకర్స్‌ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి పాదుర్తి వెంకటేశ్వర రావు, ఉపాధ్యక్షుడు బండారు మధుసూదనరావు, చుండ్రు నవ క ష్ణ, రాయవరపు పుల్లయ్య, కోసూరి రంగరాజు, మోటూరి రాంబాబు, ఉల్లి నాయుడు, ఎంవిఆర్‌ రవి శర్మ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here