వైఎస్‌ హయాంలలోనే మహిళా సాధికారత

0
51

30 మంది సభ్యులతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మహిళావిభాగం కమిటీ నియామకం

రాజమహేంద్రవరం, జనవరి 11 : దివంగత నేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హాయాంలోనే మహిళ సాధికారత సాధ్యమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ సిటి కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నగర మహిళావిభాగం కమిటీని 30 మంది సభ్యులతో నగర అధ్యక్షురాలు మార్తి లక్ష్మి సారధ్యంలో నియమించారు. వారికి రౌతు సూర్యప్రకాశరావు, జక్కంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందచేశారు. పార్టీ అధినేత జగన్‌ నాయకత్వంమీద నమ్మకంతో మహిళలు అధికంగా ఆకర్షితులై ముందుకు వస్తున్నారని, డ్వాక్రా మహిళా గ్రూపులకు రుణాల వడ్డీని మాఫీ చేసింది దివంగత నేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అని గుర్తు చేసారు. నగరంలో అన్ని డివిజన్‌ల నుండి కమిటీలు వేసిన అధ్యక్షురాలు లక్ష్మిని రౌతు ప్రత్యేకంగా అభినందించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేలా ప్రతి మహిళా కృషిచేయాలని మార్తి లక్ష్మి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, బొంత శ్రీహరి, నాయకులు మజ్జి అప్పారావు, కానుబోయిన సాగర్‌, కాటం రజనీకాంత్‌, మాసా రామ్‌జోగ్‌, పెదిరెడ్ల శ్రీనివాస్‌, డి.వి. రాఘవులు, కోడి కోట, మార్తి నాగేశ్వరరావు, మేడబోయిన సునీల్‌, అందనాపల్లి సత్యనారాయణ, ఆముదాల పెదబాబు, వాకచర్ల కృష్ణ, గుదే రఘునరేష్‌, కుక్క తాతబ్బాయి, నీలం గణపతి, ఆరీఫ్‌, గౌస్‌, జాన్‌, వంకాయల సత్తిబాబు, పోలాకి శ్రీను, రాజు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నగర మహిళా నూతన విభాగం :

ప్రధాన కార్యదర్శులుగా ఎస్‌.కె.హాసీనాబేగం , గుడాల సింహాలచం, అధికార ప్రతినిధులుగా యడ్ల లత, కవలం వెంకటలక్ష్మి, కార్యదర్శులుగా గుడాల ఆదిలక్ష్మి, మొల్లి వినయకుమారి, కుప్ప దేవి, సంకిస భవానీప్రియ, మాతా మార్త, కొప్పిశెట్టి విజయ, సహాయ కార్యదర్శులుగా నందివాడ జయమ్మ, మల్లిపూడి జ్యోతి, బైరి సత్యవతి, మాదేపల్లి వరహాలమ్మ, కొల్లాపు శాంతి, సహిత బేగమ్‌, కార్యవర్గ సభ్యులు మీసాల మణి, బొంతల మహిమ, రామతులసి, పోలిమోతి ఇంద్రాణి, పోలేటి సూర్య కుమారి, కుసుమ వేణి, పప్పుల లక్ష్మి, పాతూని నాగమణి, కోమాల రాజేశ్వరి, కోమల విమల, కె.లక్ష్మి, ఎం. సుశీల నియమితులయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here