చదవాలి….సేవాభావాన్ని అలవర్చుకోవాలి

0
46

ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్ధులకు గన్ని ప్రశంస

రాజమహేంద్రవరం, జనవరి 13 : విద్యార్ధులు పుస్తకాలతో పాటు జీవితాలను కూడా చదవాలని, అలాంటి ప్రక్రియకు ఎన్‌ఎస్‌ఎస్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. స్థానిక 13, 7 డివిజన్లలలో ఆదిత్య మహిళా కళాశాల విద్యార్ధినులు ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేక సేవా శిబిరాన్ని నిర్వహించారు. వారం పాటు జరిగిన ఈ కార్యక్రమం ముగింపు సభను 13 డివిజన్‌లోని ఎన్‌విఆర్‌ పాఠశాలలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గన్ని కృష్ణ, ప్రత్యేక అతిథులుగా టిడిపి చీఫ్‌ విప్‌ పాలిక శ్రీను, కోఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగు కుమారి, సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ కులశేఖర్‌, ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్‌ ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపాల్స్‌ సాగర్‌, ఫణికుమార్‌, టిడిపి నాయకులు ఉప్పులూరి జానకిరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ తాను ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదివినప్పుడు ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్‌గా సేవలందించానని, ఆ సమయంలో తన జీవితంలోనే కొత్త మార్పు కలిగిందన్నారు. ఆ స్ఫూర్తితో స్పందన స్వచ్ఛంద సేవా సంస్థను నెలకొల్పడంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని పాఠశాలను కూడా నిర్మిస్తున్నామన్నారు. పాఠాలు, డిగ్రీలతో పాటు సేవాభావాన్ని అలవర్చుకోవాలని కోరారు. పట్టణ ప్రాంతాలల్లోనూ కాకుండా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోకూడా ఎన్‌ఎస్‌ఎస్‌ సేవలు అందాలన్నారు. పాలిక శ్రీను, కప్పల వెలుగు కుమారి, డీఎస్పీ కులశేఖర్‌ తదితరులు మాట్లాడుతూ ఈ ఏపని చేపట్టినా అది ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు బహుమతులు అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here