ఆగస్టులో ఆర్యాపురం బ్యాంకు శత వసంత వేడుక

0
33

మే లో బ్యాంకు ప్రధాన కార్యాలయం ప్రారంభం – వెయ్యికోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా కృషి

శతవసంతాల ఆరంభ వేడుకలో బ్యాంకు చైర్మన్‌ చల్లా శంకరరావు వెల్లడి

రాజమహేంద్రవరం, జనవరి 13 : ”నగరంలోని ‘ది ఆర్యాపురం కో ఆపరేటివ్‌ అర్బన్‌ బాంక్‌ని 1918 డిసెంబర్‌ 30న రిజిస్టర్‌ చేయించి,1919 జనవరి 13న వ్యాపారం ప్రారంభించారు. స్వర్గీయ సరిపెల్ల విశ్వేశ్వర ప్రసాదరావు స్థాపించిన ఈ బ్యాంకు శత వసంతంలోకి ప్రవేశించింది. ఈ సమయంలో నేను చైర్మన్‌గా ఉండడం నా పూర్వ జన్మ సుక తం. మా పాలకవర్గం ఏర్పడి నాలుగేళ్లు అయింది. అప్పట్లో 595కోట్లు వుండే వ్యాపారం ఈనాలుగేళ్లలో రూ. 936 కోట్లకు చేరింది. దీన్ని వెయ్యి కోట్లకు చేయాలనీ క షిచేస్తున్నాం” అని బాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు చెప్పారు. బ్యాంకు వందవ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్బంగా తిలక్‌ రోడ్డులోని జె ఎన్‌ రోడ్డు బ్రాంచి దగ్గర లాంఛనంగా ఈరోజు ఉదయం వ్యవస్థాపకుని చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ అయ్యల గోపి , సెక్రటరి జి సుధాకరరావు, డైరక్టర్లు నందం బాల వెంకట కుమార్‌ రాజా, పోలాకి పరమేష్‌,నండూరి వెంకట రమణ, సూరంపూడి శ్రీహరి ,వై రంగబాబు, ముళ్ళ మాధవరావు , ఎండి అబ్దుల్‌ ఫహీమ్‌, పిల్లి శ్యాం కుమార్‌,బివీవీ సత్యనారాయణ మూర్తి,సింగంపల్లి వెంకట రామక ష్ణ, కో ఆప్టేడ్‌ డైరక్టర్లు జి ఎస్‌ ఎస్‌ మురళీమోహన్‌,గోదావరి శ్రీనివాస్‌, బ్యాంకు వ్యవస్థాపకులు విశ్వేశ్వర ప్రసాదరావు మనుమడు సత్యప్రకాష్‌, పద్మావతి దంపతులు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చల్లా శంకరరావు విలేకరులతో మాట్లాడుతూ గోకవరం బస్టాండ్‌ దగ్గర గల బ్యాంకు హెడ్డాఫీసుని మూడంతస్తులతో అధునాతనంగా నిర్మిస్తున్నామని, వచ్చే మేలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా దీన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఆగస్టులో ప్రముఖులందరినీ పిలిచి భారీ ఎత్తున శత వసంతాల వేడుక నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. హితకారిణి సమాజం చైర్మన్‌గా ఉండగా, శతవసంత వేడుకలను ఆనాటి సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డిని తీసుకొచ్చి చేశామని, అలాగే ఇప్పుడు ఆర్యాపురం బ్యాంకు శతవార్షికో త్సవం కూడా తన హయాంలోనే జరుగుతుండడం తన అద ష్టమని ఆయన చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుని తీసుకొచ్చి ఘనంగా ఉత్సవాలు చేస్తామన్నారు. ఈవిధంగా రెండు గొప్ప సంస్థలకు శతవార్షికోత్సవాలు తన హయాంలో జరగడం నిజంగా రికార్డుగా ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 21న గుంటూరు లోని అరండల్‌ పేటలో బ్రాంచి ప్రారంభిస్తామని, మార్చిలో గాజువాకలో బ్రాంచి ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. తమ పాలకవర్గం వచ్చేసరికి 9 బ్రాంచీలుండగా, కొత్తవాటితో కలిపి 8బ్రాంచీలు ఏర్పాటుచేసినట్లు అవుతోందని ఆయన చెప్పారు. దేశంలో ఏ కోఆపరేటివ్‌ బ్యాంకు కి లేని విధంగా ఆర్యాపురం బ్యాంకు కి 90వేలమంది సభ్యులున్నారని చల్లా శంకరరావు చెబుతూ, ఒక లక్షా 50వేలమంది ఖాతాదారులు ఉన్నారని తెలిపారు. షేర్‌ హోల్డర్స్‌ కి 15శాతం డివిడెండ్‌ ప్రతియేటా చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అగ్రగామి అర్బన్‌ బ్యాంకుగా విరాజిల్లుతున్న ఆర్యాపురం బ్యాంకు పురోభివ ద్ధిలో భాగస్తులైన గతంలో పనిచేసిన చైర్మన్లకు, పాలకవర్గాలకు,డైరెక్టర్లకు, సభ్యులకు, ఖాతాదారులకు,సిబ్బందికి, ప్రముఖులకు ఆయన క తజ్ఞతలు తెలిపారు. బ్యాంకు శతవసంత వేడుకల ప్రారంభం సందర్బంగా లోగోను చైర్మన్‌ శంకరరావు, డైరెక్టర్లు ఆవిష్కరించగా, వ్యవస్థాపకుని మనుమడు సత్యప్రకాష్‌ దంపతులు కేక్‌ కట్‌ చేసారు. పేదలకు చీరలు పంపిణీచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here