జింకల జయదేవ్‌ ఆధ్వర్యాన ఎన్‌టిఆర్‌ వర్ధంతి

0
43

రాజమహేంద్రవరం, జనవరి 18 : మాజీ ముఖ్యమంత్రి, తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గోదావరి గట్టుపై గౌతమ ఘాట్‌కు వెళ్ళే మార్గంలో ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద రాష్ట్ర గిరిజన పౌండేషన్‌ అధ్యక్షులు, నందమూరి అభిమాన సంఘం నాయకులు,మాజీ కార్పొరేటర్‌ జింకల జయదేవ్‌ ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, తెదేపా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, మాజీ కౌన్సిలర్లు రుంకాని వెంకటేశ్వరరావు, నక్కెళ్ళ బాబూరావు, నిమ్మలపూడి గోవింద్‌ తదితరులు ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల గుండెల్లో ఎన్‌టిఆర్‌ చిరస్థాయిగా నిలుస్తారన్నారు. గత 22 సంవత్సరాలుగా ఏకధాటిగా ఎన్‌టిఆర్‌ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్న జింకల జయదేవ్‌ను, ఆయన మిత్ర బృందాన్ని వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వక్కలగడ్డ త్రిమూర్తులు, మానేపల్లి జయప్రభునాయుడు, పులిమెంట్ల నాగరాజు, సుజాత, కె.వి.శ్రీనివాస్‌, అడపా చుక్కన్న, పూళ్ళ జయరావు, మొల్లి చిన్ని యాదవ్‌, కోట కామరాజు, ముత్యాలరావు,బిక్కిన సాంబశివరావు, పి.జోగారావు, గంగాధర చౌదరి, ఇమంది వెంకటరమణ, కోనా హరి పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here