ఆకట్టుకున్న అలయన్స్‌ క్లబ్‌ డ్యాన్స్‌ ఫెస్టివల్‌

0
51

రాజమహేంద్రవరం, జనవరి 18 : అమెరికాకు చెందిన గ్లోబెల్‌ క్రియేటివ్‌ ఆర్ట్స్‌ అకాడమీ, అసోసియేషన్‌ ఆఫ్‌ అలయన్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన తసేన్‌ త్యాగరాజ మ్యూజిక్‌, డ్యాన్స్‌ ఫెస్టివల్‌ అందరినీ ఆకట్టుకుంది. అలయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ వైస్‌ గవర్నర్‌ కొయ్యాన కుమారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ టి.ఎస్‌.ఎన్‌.రెడ్డి, ఎం.పి. మురళీమోహన్‌, మేయర్‌ పంతం రజనీ శేషసాయి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. జాతీయస్థాయి కళాకారులు కమలాకరరావు, మైసూర్‌ మంజునాథ్‌, ఇంద్రదీప్‌ గౌస్‌, పత్రి సతీష్‌కుమార్‌, గౌరీష్‌కుమార్‌, కర్మాకర్‌, సంజయ్‌కుమార్‌ జోషి, ఎన్‌.ఎస్‌.రామచంద్రమూర్తి, ప్రధాన నర్తకి సీతా మాడభూషి ప్రదర్శనలు అలరించాయి. మాడభూషిణి కొయ్యాన కుమారిని ఘనంగా సత్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here