అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచిన రౌతు

0
33

రాజమహేంద్రవరం, జనవరి 19 : స్థానిక 46వ డివిజన్‌ రామదాసుపేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అండగా నిలిచారు. బాధితులను పరామర్శించి వారికి భోజన ఏర్పాట్లు చేశారు. ఇళ్ళు కోల్పోయిన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, వంట సామాగ్రి, బియ్యం, పిల్లలకు బట్టలు, దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడబోయిన సునీల్‌కుమార్‌, చోడిశెట్టి పల్లంరాజు, ఆశపు శ్రీను, గిడుతూరి గోవింద్‌, తీపి శివ, శ్యామ్‌, కానుబోయిన సాగర్‌, వాకచర్ల కృష్ణ, వంకాయల సత్తిబాబు, నీలం గణపతి, కుక్కా తాతబ్బాయి, మోతా సుభాష్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here