గ్రామస్థాయి నుంచి బిఎస్పీని బలోపేతం చేస్తాం

0
61

22 నుంచి నియోజకవర్గాల పర్యటన : బర్రే ఆనంద్‌కుమార్‌

రాజమహేంద్రవరం, జనవరి 20 : రాష్ట్రంలో బహుజన్‌ సమాజ్‌ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని ఆ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ బర్రే ఆనంద్‌కుమార్‌ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా అధ్యక్షునిగా తన పనితీరును చూసిన పార్టీ అధిష్టానం తనను రాష్ట్ర సమన్వయకర్తగా నియమించడంతోపాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల ఇన్‌ఛార్జిగా నియమించడం జరిగిందన్నారు. ప్రస్తుత సమాజంలో రాజకీయ పార్టీలను నడపలేక చేతులెత్తేస్తున్న తరుణంలో బహుజన్‌ సమాజ్‌ పార్టీని మాయావతి నడిపిస్తూ దేశవ్యాప్తంగా 500 పార్లమెంట్‌ స్థానాలకు పోటీ చేయగలిగిన పార్టీగా నిలబెట్టారని కొనియాడారు. ఆమె స్ఫూర్తితో ఏడు జిల్లాల్లోని 101 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. అందులో భాగంగా ఈనెల 22న రాజోలు, గన్నవరం, ముమ్మిడివరం, 23న కొత్తపేట, మండపేట, రామచంద్రపురం, అనపర్తి, 24న కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌, పెద్దాపురం, పిఠాపురం, 25న ప్రత్తిపాడు, తుని, జగ్గంపేట, 27న రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, రాజానగరం నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో సమావేశమవుతున్నామని, 2019 ఎన్నికల నాటికి బిఎస్పీ సత్తాను మనువాద పార్టీలకు చూపిస్తామన్నారు. బిఎస్పీ జిల్లా అధ్యక్షులు బర్రే కొండబాబు మాట్లాడుతూ దేశంలో 15 శాతం ఉన్న వర్గాలు పరిపాలిస్తుండగా 85 శాతం ఉన్న ప్రజలు ఊడిగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి పరిస్థితులను రూపుమాపడానికి బిఎస్పీ కృషిచేస్తుందని, రానున్న ఎన్నికల్లో బిఎస్పీ సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో కార్పొరేటర్‌ బర్రే అనూ హెలెనియా, పట్నాల విజయకుమార్‌, దేశాబత్తుల ప్రేమ్‌కుమార్‌, స్వరూప్‌, గారా అజయ్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here