25 నుంచి వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనయాత్ర మహోత్సవాలు

0
42

27న నిజరూప దర్శనం – చినజీయర్‌ స్వామి ఆగమనం

29 వరకు విశేష పూజా కార్యక్రమాలు : భారీగా ఏర్పాట్లు

రాజమహేంద్రవరం, జనవరి 22 : స్ధానిక సింహాచలనగర్‌లోని శ్రీ వరాహ లక్ష్మీ న సింహ స్వామి క్షేత్రంలో 17వ వార్షిక చందన యాత్ర మహోత్సవాలు ఈనెల 25నుంచి 29వరకూ ఘనంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2002 ఫిబ్రరి 22న ఈ ఉత్సవాలు ప్రారంభం కాగా సంవత్సరమంతా చందనంలో ఉండి ఆరాధన స్వీకరించే సింహాద్రి అప్పన్న ఈ ఉత్సవాల్లో ఒక్కరోజు (జనవరి 27) మాత్రమే చందనంలోంచి బయటకు వచ్చి నిజరూపాన్ని సాక్షాత్కరిస్తారు. ఈ సందర్భంగా స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి వస్తారు. శ్రీరంగం శ్రీ మధు ఉభయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్‌ ఆధ్వర్యాన ఆలయ ధర్మకర్తలు కాలెపు సూర్య సింహాచలం, కాలెపు నాగేశ్వరరావుల సారధ్యంలో నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఈరోజు ఉదయం ఆలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. తొలుత శిఘాకొల్లి సీతారామాంజనేయులు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం శ్రీ శ్రీ శ్రీ చినజీయర్‌ స్వామి పర్యవేక్షణలో శ్రీరంగం శ్రీ మధు ఉభయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్‌కి ఈ ఆలయాన్ని అనుసంధానం చేసారని, దీంతో కె.సూర్య సింహాచలం, కె. నాగేశ్వరరావు, రాపర్తి వెంకట పద్మావతి, వెల్ల సూర్యకుమారిలతో పాటు తాను, ముడుంబై శ్యామా సుందర శ్రీమన్నారాయణ, గ్రంధి సత్య గోపాలకృష్ణ, డా. ఆరుమిల్లి సీతారత్నంలతో కూడిన కమిటీని చినజీయర్‌ స్వామి నియమించారని వివరించారు. చిన జీయర్‌ స్వామి సూచనల ప్రకారం క్షేత్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీతారామాంజనేయులు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు మహేంద్రాడ శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా 25వ తేదీ గురువారం సా. 4 గంటలకు తిరువీధి ఉత్సవం(గరుడ సేవ) పురవీధుల గుండా సాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీమాన్‌ మోర్త సీతారామాచార్యులు, శ్రీమాన్‌ గొడవర్తి రాధాక ష్ణమాచార్యులు, ఎస్‌.పి. రంగరాజ భట్టర్‌ స్వామి వారి ఆధ్వర్యంలో ఆ రోజు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్వరుణం, రక్షా సూత్రం, యాగశాలార్చన, అంకురారోపణలు జరుగుతాయని చెప్పారు. 26 వ తేదీ శుక్రవారం ఉదయం ఆరాధన, నవకలశస్నపనం, హోమాలు, సాయంత్రం ఎదురు సన్నాహం, తిరుకల్యాణ మహోత్సవం, మూర్తి కలశారాధన జరుగుతాయని వివరించారు. 27వ తేదీ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన జరుగుతాయని చెప్పారు. తర్వాత ఉ. 6 నుంచి సా.6గంటల వరకూ నిజరూప దర్శన సేవ ఉంటుందని చెప్పారు. శ్రీ చినజీయర్‌ స్వామి హాజరై, అనుగ్రహ భాషణం చేస్తారని తెలిపారు. ఆరోజు రాత్రి 8 గంటలకు సహస్ర ఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు చందన సమర్పణ, తీర్ధగోష్టి, రుత్విక్‌ సన్మానం, ఆశీర్వచనం ఉంటాయన్నారు. 28వ తేదీ ఆదివారం ఉదయం ఆరాధన, హోమాలు, నిత్యరూప దర్శనం తదితర కార్యక్రమాలుంటాయని తెలిపారు. 29వ తేదీ ఉదయం 10 నుంచి శ్రీవారి ప్రసాదం, తదియారాధన (అన్న సమారాధన) పెద్దఎత్తున జరుగుతుందని శ్రీనివాసాచార్యులు తెలిపారు. స్వామికి చందనాన్ని సమర్పించే వారు ఆలయం వద్ద సంప్రదించాలని వారు కోరారు. ఈ సందర్బంగా కమిటీ సభ్యులు చందనోత్సవాల పోస్టర్‌ని ఆవిష్కరించారు. చందనోత్సవాల్లో భక్తులు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here