సమస్యల పరిష్కారమే తెదేపా లక్ష్యం

0
34

1వ డివిజన్‌లో గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ పర్యటన

రాజమహేంద్రవరం, జనవరి 23 : ప్రజా సమస్యల పరిష్కారమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. స్థానిక 1వ డివిజన్‌లో కార్పొరేటర్‌ కడలి రామకృష్ణతో కలిసి గన్ని కృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలకు వెళ్ళి స్థానికంగా ఉన్న ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా కృషిచేస్తున్నామన్నారు. గన్ని వెంట దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, ఉప్పులూరి జానకిరామయ్య, బొట్టా వీరబాబు, తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here