29న యర్రా రైజింగ్‌ యూత్‌ అథ్లెట్‌ పోటీలు

0
33

రాజమహేంద్రవరం, జనవరి 24 : యర్రా రైజింగ్‌ యూత్‌ ఆధ్వర్యాన ఈనెల 29న ఉదయం 8 గంటల నుంచి ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో జిల్లాస్థాయిలో అథ్లెట్‌ పోటీలు నిర్వహించనున్నట్లు యూత్‌ అధ్యక్షుడు బూసి వజ్రనాధ్‌ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్ఫూర్తితో రాజకీయాలలో క్రియాశీలకంగా, నీతివంతంగా, యువతకు ఆదర్శవంతంగా నిలిచిన యర్రా వేణుగోపాలరాయుడు సారథ్యంలో సంస్థను ఏర్పాటు చేసి కార్యక్రమాలు తలపెడుతున్నామన్నారు. అందులో భాగంగా 29న జిల్లా అధ్లెటిక్‌ పోటీలు నిర్వహిస్తున్నామని, సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఈ పోటీలను నగరపాలక సంస్థ కమిషనర్‌, సబ్‌ కలెక్టర్‌, అర్బన్‌ ఎస్పీ ప్రారంభిస్తారని, అదేరోజు సాయంత్రం బహుమతీ ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. బహుమతీ ప్రదానోత్సవానికి ముఖ్యఅతిధులుగా రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, మేయర్‌ పంతం రజనీ శేషసాయి హాజరవుతారన్నారు. విలేకరుల సమావేశంలో యర్రా రైజింగ్‌ యూత్‌ ప్రధాన కార్యదర్శి వాక శ్రీనివాస్‌, కోశాధికారి రావాడ రఘు మనోహర్‌, ఉపాధ్యక్షులు దేశినీడి పృధ్విరాజ్‌, సహాయ కార్యదర్శి కుడుపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here