అలనాటి మేటి నటి కృష్ణకుమారి కన్నుమూత

0
39

బెెంగళూరు, జనవరి 24 : అలనాటి మేటి అందాల నటి కృష్ణకుమారి ఈరోజు ఉదయం కన్నుమూశారు. తెలుగు చలన చిత్ర సీమలో రెండు దశాబ్ధాలకు పైగా అగ్రనటిగా వెలుగొందిన ఆమె ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించి ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న కృష్ణకుమారి బెంగళూరులోని తన కుమార్తె వద్ద ఉంటున్నారు. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. పశ్చిమ బెంగాల్‌లో 1933 మార్చి 6న జన్మించిన కృష్ణకుమారి 1951లో చలన చిత్ర సీమలోకి అడుగుపెట్టారు. దివంగత నటులు ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావుల సరసన అనేక చిత్రాల్లో నటించిన ఆమె తెలుగుతో పాటు తమిళ, కన్నడం, మలయాళ భాషల్లో 110 కి పైగా చిత్రాల్లో నటించారు. ఆమె భర్త ఇదివరకే మరణించగా కుమార్తె వద్ద ఉంటున్న కృష్ణకుమారి మరో మేటి నటి షావుకారు జానకికి స్వయాన సహోదరి. పల్లెపడుచు, బంగారు పాప, అభిమానం, ఇలవేలుపు, కులగోత్రాలు, బందిపోటు, ఎదురీత, కానిస్టేబుల్‌ కూతురు వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించిన కృష్ణకుమారి ఎన్‌టిఆర్‌తో ఏకంగా 25 చిత్రాల్లో నటించారు. ఆమె నటనా కౌశల్యానికి గాను మూడు పర్యాయాలు జాతీయ అవార్డులు లభించాయి. నంది అవార్డులు కూడా దక్కించుకున్నారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here