సోము వీర్రాజును కలిసిన ఇందిరాసత్యనగర్‌ బాధితులు

0
51

రాజమహేంద్రవరం, జనవరి 25 : స్ధానిక 44,47 డివిజన్ల పరిధిలోని ఇందిరాసత్యనగర్‌పుంత వాసులు ఎమ్మెల్సీ సోము వీర్రాజును కలిసి తమ ఇళ్ళు తమకే దక్కేటట్లు న్యాయం చేయాలని కోరారు. 55 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో నివాసం వుంటున్న తమను అధికారులు బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నించడంతో ఆందోళన చేపట్టాల్సి వచ్చిందని వారు తెలియచేశారు. బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి కొల్లివెలసి హారిక ఆధ్వర్యంలో వారు సోము వీర్రాజును కలిసారు. లోకాయుక్త ఉత్తర్వులు, కౌన్సిల్‌ తీర్మానం అనుసరించి 80 అడుగుల రోడ్డు స్ధానంలో 40 అడుగుల రోడ్డు వేసి మిగిలిన స్ధలంలో తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. బాధితుల సమస్యను విని సానుకూలంగా ఎమ్మెల్సీ స్పందించారని కొల్లి వెలసి హారిక తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here