పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్ల అధ్యయన యాత్ర

0
48

తొలి విడతగా 27 నుంచి ముంబై, అహ్మదాబాద్‌ల్లో పర్యటన

రాజమహేంద్రవరం,జనవరి 25 : రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల బృందం రెండు విడతలుగా అధ్యయన యాత్రలను చేపట్టనుంది. దేశంలోని వివిధ అభివృద్ధి చెందిన పట్టణాలు, నగరాలను సందర్శించి అక్కడ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఈ యాత్రలను నిర్ధేశించింది. అందులో భాగంగా తొలి విడతగా ఈ నెల 27 నుంచి నాలుగు రోజుల పాటు అధ్యయన యాత్రకు వెళ్ళనుంది. ఈ పర్యటనలో గోదావరి, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, పుట్టపర్తి, విశాఖ, మచిలీపట్నం తదితర పట్టణాభివృద్ధి సంస్థల నుంచి 13 మంది ప్రతినిధుల బృందం ఈ యాత్ర చేపట్టనుంది. ఈ నెల 27, 28 తేదీల్లో ముంబై, 29, 30 తేదీల్లో అహ్మదాబాద్‌లలో పర్యటించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు వారు అనుసరిస్తున్న విధానాలను, చేపట్టిన ప్రాజక్ట్‌లను ఈ బృందం అధ్యయనం చేయనుంది. రెండవ విడతలో రాజస్థాన్‌ రాజధాని జైౖపూర్‌, పంచకుల (హర్యానా), నొయిడా (ఉత్తరప్రదేశ్‌) ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ బృందానికి విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ అధికారి బసంతకుమార్‌ నేతృత్వం వహిస్తారని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ఈరోజు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here