సమస్యల పరిష్కారానికి నడుం కట్టిన గన్ని

0
78

1వ డివిజన్‌లో అధికారులతో కలిసి పర్యటన

రాజమహేంద్రవరం,జనవరి 25 : ప్రజలకు మౌలిక సౌకర్యాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. రెండు రోజుల క్రితం 1 వ డివిజన్‌లో పర్యటించి సమస్యలను గుర్తించిన గన్ని కృష్ణ ఈరోజు ఉదయం నగర పాలక సంస్థలోని వివిధ విభాగాల అధికారులను తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. డివిజన్‌ కార్పొరేటర్‌ కడలి రామకృష్ణతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించి రోడ్లు, డ్రైన్లు, విద్యుత్‌ దీపాలు లేకపోవడాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సమస్యలపై నగర పాలక సంస్థ కమిషనర్‌తో చర్చించానని త్వరలోనే ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్ధానిక నాయకులు ఉప్పులూరి జానకిరామయ్య, బొట్టా వీరబాబు, మున్సిపల్‌ ఇంజనీర్‌ కోటేశ్వరరావు, డి.ఇ. సన్యాసిరావు, ఏఇ సత్యనారాయణ,ఎలక్ట్రికల్‌ ఏ.ఇ. వేణుగోపాలరావు, వర్క్‌ ఇనస్పెక్టర్‌ గణేష్‌, కాంట్రాక్టర్‌ ఎం. శ్రీనివాసరావు (కాపు) తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here