ముంబై సిఐడిసీఓ అధికారులతో పట్టణాభివృద్ధి సంస్థల బృందం భేటీ

0
53

రాజమహేంద్రవరం, జనవరి 27 : మెట్రోపాలిటన్‌ నగరాల్లో ప్రజలకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలు, అక్కడ జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు తొలి విడతగా నాలుగు రోజుల పాటు అధ్యయన యాత్ర చేపట్టిన రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల బృందం ఈరోజు దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంలో పర్యటించి బృహత్‌ ముంబై అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సిటీ మరియు ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (సిఐడిసీఓ) అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఈ బృందం ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి అక్కడ చేపట్టిన అనేక వివిధ కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు సిఐడిసీఓ అధికారులతో సమావేశమై వారు ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను తిలకించింది. అక్కడ చేపట్టిన ప్రాజెక్టులు, అభివృధ్దిపై చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల సందేహాలను అధికారులు నివృత్తి చేసారు. రేపు చైర్మన్లు, వైస్‌ చైర్మన్ల బృందం ప్రాజెక్టులు, అభివృధ్ది పనులను నేరుగా సందర్శించనున్నారు. ఈ పర్యటనలో గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ గన్ని కృష్ణతో సహ రాష్ట్రంలోని పలు పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు పాల్గొంటున్నారు. ఈ బృందం ఈరోజు, రేపు ముంబై నగరంలో పర్యటించి ఎల్లుండ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకుని అక్కడ రెండు రోజుల పాటు పర్యటించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here