5న రాష్ట్ర బిసి విద్యార్థి గర్జన

0
46

రాజమహేంద్రవరం, జనవరి 25 : వచ్చే నెల 5న ఎస్‌ కె వి టి కాలేజీ గ్రౌండ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బిసి విద్యార్థి గర్జన నిర్వహిస్తున్నట్లు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుల సూర్యారావు తెలిపారు. స్ధానిక ప్రెస్‌ క్లబ్‌ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గంగుల సూర్యారావు మాట్లాడుతూ కాలేజీ, హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ చార్జీలు నెలకు 1050నుంచి 2వేలకు పెంచాలని,బస్‌ పాస్‌ ,ఇతర ఖర్చులకోసం నెలకు 600రూపాయల చొప్పున ఇవ్వాలని,హాస్టల్‌ విద్యార్థులకు పండుగ రోజుల్లో, ప్రతి ఆదివారం మటన్‌ లేదా చికెన్‌తో భోజనం పెట్టాలని, కాస్మొటిక్‌ చార్జీలు పెంచాలని ఆయన డిమాండ్‌ చేసారు. బిసి విద్యార్థులు ఫీజు రీ ఎంబర్స్‌ మెంట్‌ ద్వారా లబ్ది పొందడానికి ఆర్‌ క ష్ణయ్య కారణమని, అందుకే ప్రతి విద్యార్థి ఈ గర్జనకు విచ్చేసి ఆయనను సత్కరించి మానవత్వం చాటుకోవాలని సూర్యారావు కోరారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం నగర అధ్యక్షులు ఎండి మున్నా, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు గున్నేపల్లి సుభాష్‌, బి రాజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here