మోడీ సంస్కరణలను అధ్యయనం చేయండి

0
52

మాజీ ఎంపి ఉండవల్లికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సూచన

రాజమహేంద్రవరం, జనవరి 25 : ప్రధానమంత్రి నరేంద్ర మోడి ప్రవేశ పెట్టిన పధకాలు, సంస్కరణలపై అధ్యయనం చేసిన తరువాత మాట్లాడితే బాగుంటుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్‌కి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సూచించారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ అవినీతి మకిలి అంటకుండా పరిపాలన చేస్తుంటే, దాన్ని కూడా అపహాస్యం చేసేవిధంగా మాట్లాడటం సరికాదన్నారు.కాంగ్రెస్‌ హయాంలో అప్పటికే 5లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన ప్రభుత్వానికి అదనపు ఆదాయం కోసం అవకాశం ఇవ్వకుడన్న ఉద్దేశ్యంతోనే ఆనాడు జీఎస్టీని మోడీ వ్యతిరేకించారని వీర్రాజు చెప్పారు. అవినీతికి తావులేకుండా అభివ ద్ధి ఎజెండాగా పనిచేస్తున్నందునే జీఎస్టీని అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అన్యాయంగా రాష్ట్ర విభజన చేయడమేకాకుండా, పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించి ముంపు మండలాలను,అలాగే భద్రాద్రి రాముడిని ఏపీలో కాకుండా తెలంగాణాలో కలుపుతుంటే కాంగ్రెస్‌ ఎంపీలుగా ఉండి ఎందుకు మాట్లాడలేదని వీర్రాజు ప్రశ్నించారు. తాము వచ్చాక ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ముంపు మండలాలను ఏపీలో కలిపామన్నారు. నితిన్‌ గడ్గారి సారధ్యంలో 2019నాటికి పోలవరం పూర్తి అవుతుందని ఇందులో ఎలాంటి అపోహలు వద్దని వీర్రాజు పేర్కొన్నారు. అధికారంలో ఉన్నంత కాలం ఏమి చేయని రఘువీరా రెడ్డికి పాదయాత్ర చేసే హక్కు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. నోట్ల రద్దు వలన ఎన్నో ఉపయోగాలున్నాయని, అందుకే ప్రజలు అర్ధం చేసుకుని సహకరించారని, భూముల ధరలు తగ్గాయని అన్నారు. ప్రత్యేక హోదా అనే ముగిసిందని, దానికంటే ప్రత్యేక ప్యాకేజి ద్వారా రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరాయని, అందులో భాగంగా మూడేళ్ళలో లక్షా 26 వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చాయన్నారు.16 యూనివర్సిటీలు కూడా వచ్చాయనన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ఎక్కువ సాయం చేయడానికి కేంద్రం కట్టుబడి వుందని, 2019 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రం పూర్తి చేస్తుందని అని వీర్రాజు పేర్కొన్నారు. హోదాకు పార్టీలతో పొత్తుకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేసారు. నిజానికి తాను ఉండవల్లికి శిష్యుడనని జై ఆంధ్ర ఉద్యమం బలంగా జరుగుతున్నా రోజుల్లో ఉండవల్లి ప్రసంగాలకు ఆకర్షితుడినయ్యాన్నని,ఆనాడు ఇందిరాగాంధీని విమర్శించిన ఆయన ఆ తర్వాత అదే పార్టీలో ఎంపీ అయ్యారని, ఇందిరాగాంధీ కొడుకు, కోడలు,మనవడికి ఆయనే అనువాదం చేసారని, తానుమాత్రం ఇలాగే బీజేపీలో ఉండిపోయానని ఆయన చెప్పారు. బిజెపి అర్బన్‌ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, కార్పొరేటర్‌ రేలంగి శ్రీదేవి, మహిళా మోర్చా అధ్యక్షురాలు తంగెళ్ల పద్మావతి, బూర రామచంద్రరావు, సవితాల చక్రభాస్కరరావు, పడాల నాగరాజు, నిళ్ళా ప్రసాద్‌, తంగెళ్ళ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here