మోదీ మౌనం – పరివారానికి బలం (శనివారం నవీనమ్)

0
75

మోదీ మౌనం – పరివారానికి బలం
(శనివారం నవీనమ్)

వ్యక్తిగతమైన ప్రయోజనాలు వ్యవస్ధల్ని బ్రష్టుపట్టించడం నరేంద్రమోదీ పాలనలో వున్నంత తీవ్రంగా గతంలోలేదు. విధానాలపై, వాటి అమలుపై, తలెత్తే విమర్శ అసమ్మతులు, వ్యతిరేకతలు, విమర్శలు పాలకులను పెడదారిపట్టకుండా మార్గదర్శనం చేస్తాయి. ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతాయి. భావప్రకటనా స్వేచ్ఛ అవసరమూ, ప్రయోజనమూ ఇదే!

మోదీ పరివారానికి ఈ విలువలపై గౌరవమూ, నమ్మకమూ లేవు. విమర్శలపై ఆలోచించుకోగల
ఓర్పూ,సహనాలులేవు.

మోదీ అధికారంలోకి వచ్చాక హేతువాద భావజాలం కలిగిన వ్యక్తులు, మేధావులు, కవులు, రచయితలు, జర్నలిస్టులు, కళాకారులపై, ఆర్‌ఎస్‌ఎస్‌, భజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌, అనుబంధ సంఘాలు దాడులకు పాల్పడి 28 మందిని దారుణంగా హత్య చేశారు. ఇందులో వ్యక్తిగతంగా మోదీ కీ, ప్రత్యక్షంగా బిజెపి కి ఏమాత్రం బాధ్యత లేకపోవచ్చు. అయితే ఈ సంఘటనలపై ప్రభుత్వం మౌనంగా వుండిపోవడాన్ని బట్టే పాలకుల ఉద్దేశాలు స్పష్టమౌతున్నాయి. నచ్చని వారిపై, విమర్శకులపై భౌతిక దాడులు చేసినా అడీగేవారు లేరన్న తప్పుడు సంకేతాలు వెలువడుతున్నాయి.

కేరళ ముఖ్యమంత్రిని హత్య చేస్తే కోటి రూపాయలు నజరానా ఇస్తామని ప్రకటించినా వ్యక్తులపై ఎలాంటి చర్యలూ లేవంటే ఆవ్యక్తుల వున్న సంస్ధలకు బిజెపికి వున్న సంబంధబాంధవ్యాలను అర్ధంచేసుకోవచ్చు.

లక్షా 78 వేల రూపాయల 2జి స్పెక్ట్రమ్‌ కుంభకోణం దేశంలోనే అతిపెద్దదని స్వయంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోడీయే ఆరోపించారు. అలాంటి కేసులో జై జైలుకు వెళ్ళిన కనిమొళి, రాజాలు నిర్దోషులుగా విడుదలైపోయారు…అదే సమయంలో తమిళనాడులో రాజకీయాలను
అనుకూలంగా మార్చుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తున్నది.

ఇంచుమించు అదే సమయంలో బిజెపి రాజకీయ ప్రత్యర్థి, బీహార్‌ మాజీ సీఎం లాలూప్రసాద్‌ జైలుకి వెళ్ళారు. తప్పు చేసిన వారు శిక్షింపబడవలసినదే! అయితే శిక్షలో అయినవాళ్ళకు ఒక న్యాయమూ, కానివాళ్ళకు ఒక న్యాయమూ వుండటమే అభ్యంతరకరం.

కోర్టునిర్ణయాల్లో మోదీ ప్రమేయమో బిజెపి ప్రమేయమో ఎలా వుంటుందన్న ప్రశ్న వాదనకు మాత్రమే పనికొస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆ కోర్టు జడ్జిలే విలేకరుల సమావేశంలో ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే! వివాదాస్పదమైన ప్రధాన న్యాయమూర్తి నియామకంలో పిఎంఓ ప్రమేయం వుందన్నదీ బహిరంగ రహస్యమే!

ఫెడరల్ ధర్మం మీద మోదీకి ఏమాత్రం గౌరవం లేదనడానికి ఆంధ్రప్రదేశ్ కి మించిన ఉదాహరణ అవసరం లేదు. విభజన చట్టాన్ని అమలు చేయరు. ప్రత్యేక హోదా వాగ్దానాన్ని పట్టించుకోరు. ఏమి చేయబోతున్నారో ఒక్కమాటా చెప్పరు. 20 నెలలపాటు ముఖ్యమంత్రికి అపాయింట్ మెంటు ఇవ్వని అహంకారానికి మోదీ తప్ప ఎవరి బాధ్యతా లేదు!

కేంద్ర ప్రతినిధి అయిన గవర్నర్ విందు ఆహ్వానాన్ని లిఖిత పూర్వకంగా తిరస్కరించడంద్వారా సిపిఐ తన వ్యతిరేతను నమోదు చేసింది.

రెండు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆ లేఖలో సిపిఐ ఆరోపించింది. పార్టీ ఫిరాయింపు నకు పాల్పడిన 28 మంది ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన వారితో గవర్నర్‌ ప్రమాణస్వీకారం చేయించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అభాసు పాలు చేస్తున్నారని వివరించారు.

కేంద్రమే విధానాలను ఉద్దేశపూర్వకంగా దారితప్పించినపుడు. కేంద్రం ఏజెంటు ని దారిలో పెట్టడం ఎలా కుదురుతుందన్నదే ప్రశ్న!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here