అహ్మదాబాద్‌లో పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్ల బృందం పర్యటన

0
36

రాజమహేంద్రవరం, జనవరి 29 : రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థల చైర్మన్ల, వైస్‌ చైర్మన్ల అధ్యాయన యాత్ర మూడవ రోజైన నేడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కొనసాగింది. ముంబైలో రెండు రోజుల పాటు పర్యటన ముగించుకుని అహ్మదాబాద్‌ చేరుకున్న ఈ బృందానికి అహ్మదాబాద్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు ప్రధాని మోదీ సూచన మేరకు ఖాదీ చేతి రుమాళ్ళలో గులాబీ పువ్వులను ఉంచి సంప్రదాయబద్ధమైన రీతిలో స్వాగతం పలికారు. ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో సమానమైన జనాభా, విస్తీర్ణం కలిగి దేశంలో పెద్ద ఎత్తున పట్టణీకరణ జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న గుజరాత్‌లో అత్యధికంగా 16 అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలు, 113 ఏరియా డిజిగ్నెటెడ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలు ఉండగా అక్కడి నగరాల, పట్టణాల సమగ్రాభివృద్ధికి ఆయా అథారిటీలు అమలు చేస్తున్న కార్యక్రమాలను ఈ బృందం పరిశీలించి అధ్యాయనం చేస్తోంది. రేపు కూడా అహ్మదాబాద్‌లో ఈ బృందం యాత్ర కొనసాగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here