రాజానగరంలో వైకాపా నేతల పాదయాత్ర

0
44

రాజమహేంద్రవరం, జనవరి 29 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి చేపట్టిన మహా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా రాజానగరం నియోజకవర్గం మూడు మండలాలలో ఆ పార్టీ నేతలు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా హాజరయ్యారు. ప్రజా సమస్యల కోసం పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకమవుతున్న జగన్మోహనరెడ్డి నాయకత్వాన్ని అందరూ బలపరచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here