సంక్షేమ రాజ్యమే జగన్‌ ధ్యేయం

0
44

పార్టీ అధినేతకు సంఘీభావంగా నగరంలో వైకాపా నేతల పాదయాత్ర

ఉత్సాహంగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు – విభాగాల వారీగా సాగిన కార్యక్రమం

రాజమహేంద్రవరం, జనవరి 29 : మహానేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో కొనసాగిన సంక్షేమ రాజ్యం మళ్ళీ రావాలంటే జగన్‌ ముఖ్యమంత్రి కావాలని, దానికి ప్రజలందరూ మద్దతు తెలపాలని వై.ఎస్‌. కాంగ్రెస్‌ పార్టీ రాజమండ్రి పార్లమెంట్‌ అధ్యక్షులు కొయ్య మోషేన్‌ రాజు అన్నారు. పార్టీ సిటీ కో-ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు సారధ్యంలో వైకాపా నేతలు, కార్యకర్తలు ఈరోజు జగన్‌ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా కోటగుమ్మం సెంటర్‌ నుంచి కోటిపల్లి బస్టాండ్‌ వరకు పాదయాత్ర చేపట్టారు. ముందుగా కోటగుమ్మం సెంటర్‌లోని రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాదయాత్రను కొయ్యా మోషేన్‌ రాజు ప్రారంభించారు. ఈ పాదయాత్రలో పార్టీ శ్రేణులతోపాటు ఎస్సీ సెల్‌ విభాగం, మహిళా విభాగం, ప్రచార కమిటీ విభాగం, యువజన విభాగం, మైనార్టీ విభాగం, ట్రేడ్‌ యూనియన్‌ విభాగం, నగర బీసీ విభాగం, సేవాదళ్‌ విభాగం నాయకులు తమ క్యాడర్‌తో వచ్చి బ్యానర్లు ప్రదర్శించి పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో రౌతుతోపాటు పార్టీ గ్రేటర్‌ అధ్యక్షులు కందుల దుర్గేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికలలో వచ్చిన హామీలను, మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని, ఆ విషయాలనే ప్రజలకు వివరిస్తూ, వారి అవసరాలను తెలుసుకుంటూ జగన్మోహనరెడ్డి చేపట్టిన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుందన్నారు. ఆయన పాదయాత్రకు అడుగడుగునా విశేషమైన స్పందన వస్తుందని, రానున్న ఎన్నికల్లో వైకాపా గెలుపు ఖాయమన్నారు. నగరంలో జగన్‌కు మద్దతుగా భారీ ఎత్తున రౌతు సూర్యప్రకాశరావు పాదయాత్ర చేపట్టారని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ శ్రేణులంతా ప్రజలను చైతన్యపరచాలన్నారు. రౌతు మాట్లాడుతూ జగనన్నకు మద్దతుగా పార్టీలోని అన్ని విభాగాల వారు, కార్పొరేటర్లు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, ఇదే ఐక్యతతో 2019 ఎన్నికలలోనూ పార్టీ అధినేతను ముఖ్యమంత్రిగా చేసే వరకు విశ్రమించకూడదని పిలుపునిచ్చారు. పాదయాత్ర చేస్తున్న జగన్మోహనరెడ్డికి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్‌ లీడర్‌ షర్మిలారెడ్డి, మాజీ ఫ్లోర్‌లీడర్‌ పోలు విజయలక్ష్మి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, బొంతా శ్రీహరి, ఈతకోట బాపన సుధారాణి, పిల్లి నిర్మల, పార్టీ నాయకులు సుంకర చిన్ని, అడపా శ్రీహరి, వాకచర్ల కృష్ణ, మజ్జి అప్పారావు, సాలా సావిత్రి, జక్కంపూడి గణేష్‌, మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు, పెదిరెడ్ల శ్రీనివాస్‌, కాటం రజనీకాంత్‌, నయీమ్‌ భాయ్‌, నరవ గోపాలకృష్ణ, ఉప్పాడ కోటరెడ్డి, కొత్తపేట రాజా, మరుకుర్తి కుమార్‌, సంకిస భవానీప్రియ, పెంకే సురేష్‌, సప్పా ఆదినారాయణ, అందనాపల్లి సత్యనారాయణ, పొడుగు శ్రీను, మహ్మద్‌ ఆరిఫ్‌, తామాడ సుశీల, మారిశెట్టి వెంకటేశ్వరరావు, సత్యనారాయణచౌదరి, కవల వెంకటలక్ష్మి, పతివాడ రమేష్‌, ఎం.డి.హసీనా, గుడాల ఆదిలక్ష్మి, కుక్కా తాతబ్బాయి, కట్టా సూర్యప్రకాశరావు, ఆముదాల పెదబాబు, గుదే రఘునరేష్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here