స్వర్ణాంధ్ర సేవలు మార్గదర్శకం

0
37

ఘనంగా 14వ వార్షికోత్సవం

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 3 : వృద్ధుల, అనాధల, యాచకుల సంరక్షణకు స్వర్ణాంధ్ర కృషి అభినందనీయమని ట్రిప్స్‌ ఇంటర్నెషనల్‌ స్కూల్స్‌ అధినేత బాల త్రిపుర సుందరి అన్నారు. ఈరోజు ఉదయం స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం ప్రాంగణంలో జరిగిన వృద్ధాశ్రమ 14వ వార్షికోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి స్వర్ణాంధ్ర నిర్వాహకులు లయన్‌ డా|| గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. వృద్ధాశ్రమ నిర్వాహణకు సహకారం అందిస్తున్న దాతలకు, నగర ప్రజానికి, అధికార, అనధికార ప్రముఖులకు రాంబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యఅతిథి బాల త్రిపుర సుందరి మాట్లాడుతూ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులను ఆదరించడమే కష్టమైన ఈ రోజుల్లో ప్రతి రోజూ 300 మందికి అన్నదానం ఏర్పాటు చేసి స్వర్ణాంధ్ర రాంబాబు విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. రాంబాబు చేస్తున్న సేవలకు అందరూ చేయూతనివ్వాలని కోరారు. లయన్స్‌ క్లబ్‌ పూర్వపు గవర్నర్‌ గ్రంథి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో స్వచ్ఛంద సేవలకు స్వర్ణాంధ్ర ఒక ప్రయోగశాల అని, అనేక మందికి స్వర్ణాంధ్ర సేవలు స్ఫూర్తినిస్తున్నాయన్నారు. మాజీ కార్పొరేటర్‌ బూర రమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ వృద్ధాశ్రమ నిర్వహణలో రాంబాబు చేస్తున్న కృషికి ప్రభుత్వం కూడా సహాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా 100 వృద్ధులకు రూ. 100 పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర వృద్ధులకు సహాయం చేస్తున్న దాతలను నిర్వాహకులు రాంబాబు సత్కరించి, జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర ఉపాధ్యక్షులు భరణి తాతేశ్వర్‌, డిపి రాజు, వై. శశికళ, రవీంద్ర, బి. దుర్గాదేవి, ఆనెం రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here