నూతన భవనం ప్రారంభోత్సవానికి రండి

0
77

సీఎం చంద్రబాబుకు ఆర్యాపురం బ్యాంక్‌ పాలకమండలి ఆహ్వానం

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6 : ఆర్యాపురం బ్యాంక్‌ నూతన భవనం ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా జరిపించేందుకు కార్యక్రమం ఖరారైంది. నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం మే మొదటివారంలో ఏర్పాటు చేసుకుంటున్నామని, బ్యాంకు శతవసంతాల వేడుకలు జరుగుతున్న సందర్బంలో నూతన భవనం ప్రారంభోత్సవం చేయాల్సిందిగా బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి ఆహ్వానించారు. రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి ఆధ్వర్యంలో బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, పాలకవర్గసభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అమరావతిలో కలిసారు. మే 2,3 తేదీలలో ఒక రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్లుగా ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక షేర్‌¬ల్డర్స్‌, ఖాతాదారులు వున్న కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకుల్లో ఆర్యాపురం బ్యాంక్‌ మొదటిస్ధానంలో వుందని, ఈ ఏడాది వందో సంవత్సరంలోకి ప్రవేశించామని, శతవసంతాల ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చల్లా శంకరరావు వివరించారు. ఆర్యాపురం బ్యాంక్‌ నూతన భవనం ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారని చల్లా శంకరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ అయ్యల కృష్ణగంగాధరరావు(గోపి), డైరెక్టర్లు సూరంపూడి శ్రీహరి, నండూరి వెంకటరమణ, నందం బాలవెంకటకుమార్‌రాజా, పోలాకి పరమేశ్వరరావు, పిల్లి శ్యామ్‌కుమార్‌, మహ్మద్‌ అబ్ధుల్‌ ఫహీమ్‌, ముళ్ల మాధవరావు, యెనుముల రంగారావు(రంగబాబు), బొబ్బిలి వీరవెంకటసత్యనారాయణ, సింగరపల్లి వెంకట రామకృష్ణ, జి.శ్రీనివాస్‌, జి.ఎస్‌.ఎస్‌.మురళీమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here