అందుబాటులోకి నమ్మా టాయిలెట్స్‌

0
39

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 7 : నగరంలో ప్రజల సౌకర్యార్థం నమ్మా టాయిలెట్స్‌ అందుబాటులోకి వచ్చాయని మేయర్‌ పంతం రజనీ శేషసాయి తెలిపారు. ఓఎన్జీసీ సహకారంతో స్థానిక 25వ డివిజన్‌ డీలక్స్‌ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన నమ్మా టాయిలెట్స్‌ను మేయర్‌, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓడిఎఫ్‌ నగరంగా గుర్తించినందున ఓఎన్జీసీ సంస్థకు చెందిన సిఎస్‌ఆర్‌ నిధులతో నమ్మా టాయిలెట్స్‌ నిర్మించామని, నగరంలో మరిన్ని చోట్ల నిర్మించేందుకు ఓఎన్జీసీ ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. నగర ప్రజలు వీటిని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొమ్మ శ్రీనివాసరావు, మాటూరి రంగారావు, మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌, టిడిపి యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, పార్టీ నాయకులు తవ్వా రాజా, గుణపర్తి శివ, ముత్యాల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here