హ్యాపి సండేలో శివరాత్రి సందడి

0
28

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 11 : నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కర్‌ ఘాట్‌ వద్ద నిర్వహించిన హ్యాపీ సండేలో మహాశివరాత్రి సందడి కనిపించింది. మరో రెండు రోజుల్లో మహాశివరాత్రి సమీపిస్తున్న నేపధ్యంలో నగరపాలక సంస్ధ డ్యాన్స్‌ టీచర్‌ సాయి అద్భుతమైన ప్రదర్శన చేసి అందరిని భక్తి పారవశ్యంలోకి తీసుకెళ్ళారు.పరమ శివుడు, భక్తుడు కన్నప్ప మధ్య జరిగిన సంఘటనను కళ్ళకు కట్టినట్టు చూపించారు. అలాగే రామదాసు పేట ప్రాధమిక పాఠశాల, ధాన్యంపాకలు ప్రాధమిక పాఠశాల, శ్యామలాంబ యుపి పాఠశాల, ఎస్‌.కె.వి.టి.స్కూల్‌, దానవాయిపేట నగరపాలక సంస్థ పాఠశాల,ఎస్‌.కె.మధు డాన్స్‌ స్కూల్‌, సునీల్‌ వర్ష్‌ డాన్స్‌ స్కూల్‌ విద్యార్థులు వివిధ సినీ, జానపద గీతాలకు న త్యాలు ప్రదర్శించారు. శ్రీ ప్రకాష్‌ కాలేజ్‌ విద్యార్థి శక్తి న త్య ప్రదర్శన చేయగా, మొగల్‌ షా అనే యువకుడు దాన వీర శూర కర్ణ చిత్రంలో దుర్యోధన పాత్రలో ఎన్‌టిఆర్‌ చెప్పిన డైలాగులతో అభినయాన్ని ప్రదర్శించగా, గుంటూరుకు చెందిన మధు బాలక ష్ణ డైలాగులతో అందరిని అలరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేనేజర్‌ సిహెచ్‌.శ్రీనివాసరావు, కార్యదర్శి శైలాజావల్లీ, స్కూల్స్‌ సూపర్‌ వైజర్‌ దుర్గాప్రసాద్‌ పాల్గొనగా విశ్రాంత ఉపాధ్యాయుడు రాజేష్‌, ఉపాధ్యాయురాలు రమాదేవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here