కష్టపడి పార్టీకి పూర్వ వైభవం తీసుకురండి

0
46

కాంగ్రెస్‌ సేవాదళ్‌కు జాతీయ చీఫ్‌ ఆర్గనైజర్‌ కృష్ణకుమార్‌ పాండే పిలుపు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 19 : రానున్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపులో సేవాదళ్‌ కీలకపాత్ర పోషించాలని కాంగ్రెస్‌ జాతీయ సేవాదళ్‌ చీఫ్‌ ఆర్గనైజర్‌ కృష్ణకుమార్‌ పాండే అన్నారు. జిల్లా సేవాదళ్‌ ఆర్గనైజర్‌ గోలి రవి ఆధ్వర్యంలో వై-జంక్షన్‌లోని ఆనం రోటరీ హాలులో జిల్లా సేవాదళ్‌ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా కృష్ణకుమార్‌పాండేతోపాటు కేంద్ర మాజీమంత్రి ఎం.ఎం.పళ్ళంరాజు, సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షులు భవానీ నాగప్రసాద్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పంతం నానాజీ, మాజీ ఎం.పి. బుచ్చి మహేశ్వరరావు, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌.వి.శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న ఎన్‌డిఏ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాసి వెంకట్రావు, సుధాకర్‌, శివగణేష్‌, ముళ్ళ మాధవ్‌, ఆకుల భాగ్య సూర్యలక్ష్మి, అసదుల్లా అహ్మద్‌, బాలేపల్లి మురళీధర్‌, అంకం గోపి, అబ్దుల్లా షరీఫ్‌, మార్టిన్‌ లూధర్‌, తాళ్ళూరి విజయకుమార్‌, చాపల చిన్నిరాజు, పిశిపాటి రవీంద్ర శ్రీనివాస్‌, కొమాండూరి కుమారి, లోడ అప్పారావు, నలబాటి శ్యామ్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here