అధ్యయనం.. ఆచరణ

0
62

తమిళనాడులో కొనసాగుతున్న కార్పొరేటర్ల స్టడీ టూర్‌

నీటి సరఫరా, పారిశుద్ద్యం, పన్నుల విధానంపై పరిశీలన

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 19 : నగరపాలక సంస్థ కార్పొరేటర్ల స్టడీ టూర్‌ ఉత్సాహంగా సాగుతోంది. ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న విధానాలు, చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు, పన్నుల విధానం, మంచినీటి సరఫరా తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు మేయర్‌ పంతం రజనీ శేషసాయి సారధ్యంలో కార్పొరేటర్లు రాజమహేంద్రవరం నుంచి పయనమయ్యారు. ఈనెల 17న నగరం నుంచి పయనమైన కార్పొరేటర్ల బృందం తొలుత తమిళనాడులోని చెన్నై నగరపాలక సంస్థను సందర్శించి అక్కడ పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాండిచ్చేరి వెళ్ళి అక్కడ నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌.గణేశన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా నగరపాలక మండలికి కమిషనర్‌ గణేశన్‌ పూలబొకే అందించి స్వాగతం పలికారు. స్థానిక పరిపాలనలో అమలు చేస్తున్న విధానాలు, అభివృద్ధి, పన్నుల విధానం, శానిటేషన్‌ తదితర విషయాలను ఆయన వివరించారు. అనంతరం ఈ బృందం తిరుచ్చికి పయనమైంది. మేయర్‌ రజనీ శేషసాయితోపాటు డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, పితాని లక్ష్మీకుమారి, కోరుమిల్లి విజయశేఖర్‌, గగ్గర సూర్యనారాయణ, పాలిక శ్రీను, ఈతకోట బాపన సుధారాణి, తంగేటి వరలక్ష్మి, కిలపర్తి శ్రీనివాస్‌, గొందేశి మాధవీలత, కురగంటి ఈశ్వరి, బూర దుర్గాంజనేయరావు, పిల్లి నిర్మల, పైడిమళ్ళ మెర్సీప్రియ, మజ్జి నూకరత్నం, ద్వారా పార్వతీ సుందరి, రెడ్డి పార్వతి, కరగాని మాధవి, తంగెళ్ళ బాబి, సింహ నాగమణి, మళ్ళ నాగలక్ష్మి, రేలంగి శ్రీదేవి, గరగ పార్వతి, బర్రే అనూ హెలెనియా, కో-ఆప్షన్‌ సభ్యులు మజ్జి పద్మ, కప్పల వెలుగుకుమారి, నగరపాలక సంస్థ అధికారులు ఈ బృందంలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here