ధన్యవాదాలు సీఎం సారూ..

0
30

ముఖ్యమంత్రికి చాంబర్‌ కృతజ్ఞతలు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 21 : బహుళార్ధక ప్రాజెక్ట్‌ పోలవరం నిర్మాణానికి సంబంధించి గత కాంట్రాక్టర్‌ విజ్ఞాపన మేరకు రూ.3కోట్ల విలువైన నిర్మాణ సామాగ్రిని అందజేసిన వర్తకులకు కొన్ని అవాంతరాల దృష్ట్యా కాంట్రాక్టర్‌ బిల్లులు చెల్లించకపోవడంతో ఈ విషయాన్ని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దృష్టికి చాంబర్‌ అధ్యక్ష, కార్యదర్శులు దొండపాటి సత్యంబాబు, గౌరవ కార్యదర్శి గ్రంథి పిచ్చియ్య తీసుకువెళ్ళారు. దీంతో ఆదిరెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళడంతో ఆయన తక్షణమే స్పందించి అతి తక్కువ రోజుల్లోనే వర్తకుల బ్యాంక్‌ ఎక్కౌంట్లలో వారికున్న బకాయిల సొమ్మును జమ చేయడం జరిగింది. దీంతో చాంబర్‌ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు తదితరులు సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఎంతో కృషిచేసి వర్తకులకు అండగా నిలిచిందని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగానే జిఎస్టీ అమలులో వర్తకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here