ఆఫర్‌తో ఆహ్వానిస్తున్న కో-ఆప్టెక్స్‌

0
32

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 22 : తమిళనాడు ప్రభుత్వ చేనేత సంస్థ కో-ఆప్టెక్స్‌ సేల్స్‌ ఎంపోరియం ఆఫర్లతో వినియోగదారులను ఆహ్వానిస్తోంది. స్థానిక జెండాపంజారోడ్‌లోని అజంతా హోటల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన కో-ఆప్టెక్స్‌ షోరూమ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సేల్స్‌ కమ్‌ ఎగ్జిబిషన్‌ను ఈరోజు సమాచార శాఖ ఎ.డి.జి.మనోరంజన్‌ ప్రారంభించారు. ఈ సేల్స్‌ కమ్‌ ఎగ్జిబిషన్‌లో రెండు వస్త్రాలు కంటే ఒక వస్త్రం ఉచితంగా అందజేయబడుతుందని ఎంపోరియం మేనేజర్‌ ఎస్‌.గుణశేఖరన్‌ తెలిపారు. పట్టుచీరలు, కాటన్‌ చీరలు, చెట్టినాడు కాటన్‌ చీరలు, దుప్పట్లు, లుంగీలు, టవల్స్‌ ఉంటాయని, ఈ ఎగ్జిబిషన్‌ మార్చి 31 వరకు ఉంటుందన్నారు. మనోరంజన్‌ మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమాచారశాఖ డివిజనల్‌ పిఆర్‌ఓ జె.వెంకటేశ్వరరావు, సిబ్బంది భూపతి, చోటీమా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here