వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కందుల దుర్గేష్‌

0
62

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 23 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా శాసనమండలి మాజీ సభ్యులు కందుల దుర్గేష్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పార్టీ గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షునిగా కొనసాగుతున్న దుర్గేష్‌ మంచి వక్తగా, ప్రజా సమస్యలపై, సమకాలీన రాజకీయాలపై మంచి అవగాహన కలిగి చురుకైన నాయకునిగా ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు ప్రత్యేక హోదా, సమకాలీన రాజకీయాలపై గట్టిగా పార్టీ వాణిని వినిపించవలసిన ప్రస్తుత కీలక తరుణంలో దుర్గేష్‌ను ఈ పదవిలో నియమిస్తూ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పలువురు దుర్గేష్‌కు తమ అభినందనలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here