రేపు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

0
60

రాజప్ప కుమారుని వివాహ వేడుకలకు హాజరు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 28 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు జిల్లాకు వస్తున్నారు. కాకినాడలోని జెఎన్‌టియు గ్రౌండ్స్‌లో రేపు రాత్రి జరిగే ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప కుమారుని వివాహ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. సీఎం రేపు సాయంత్రం ప్రత్యేక విమానంలో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో కాకినాడ బయలుదేరి వెళతారు. వివాహ వేడుకల్లో పాల్గొని రాత్రి రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుని తిరిగి విజయవాడ బయలుదేరి వెళతారు. సీఎం రాక సందర్భంగా జిల్లా అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సబ్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, నగర పాలక సంస్థ కమిషనర్‌ విజయరామరాజు, అర్బన్‌ ఎస్పీ బి. రాజకుమారి తదితరులు విమానాశ్రయంలో ఏర్పాట్లను పరిశీలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here