బాబును తిట్టడం కాదు… ప్రజల కోపాన్ని చల్లార్చండి

0
42

ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు గుడా చైర్మన్‌ గన్ని సలహా

కాకినాడ, ఫిబ్రవరి 28 : రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వంతో, తమ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీతో సంయమనం పాటిస్తున్నామని, దీనిని ఆసరాగా తీసుకుని సీఎం చంద్రబాబునాయుడుపై ఆ పార్టీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. కాకినాడలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ మిత్ర ధర్మంతో ఎన్ని ఇబ్బందులు వస్తున్నా సంయమనం పాటిస్తున్నామని, అయితే ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రతి నిత్యం సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చారో ఆ విషయాలు చెప్పాలని, కేంద్రం తీరుపై ప్రజల్లో పెల్లుబికుతున్న ఆవేశాన్ని చల్లార్చాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో బిజెపి నాయకులు చేసిన వాగ్ధానాలను అపుడు పత్రికల్లో వచ్చాయని, వాటిని చూపించి తాము కూడా ప్రశ్నించగలమని అన్నారు. ఇకనైనా రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలకు ద్రోహం చేస్తే వారు క్షమించరని గన్ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here