9న ఇస్కాన్‌ జగన్నాథ రథయాత్ర 9న

0
40

రాజమహేంద్రవరం, మార్చి 7 : రాజమండ్రి ఇస్కాన్‌ మందిరం ఆధ్వర్యాన ఈనెల 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కోటిపల్లి బస్టాండ్‌ నుంచి శ్రీ జగన్నాధ రథయాత్ర ప్రారంభమవుతుందని శ్యామాంగ శ్రీనివాస దాస్‌ చెప్పారు. గౌతమఘాట్‌లోని ఇస్కాన్‌ మందిరంలో ఈరోజు ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగత్తుకే నాధుడైన జగన్నాధుడు అనంతమైన కరుణ జూపుతూ పురవీధుల్లోకి రాబోతున్నాడని అన్నారు. ఇప్పటివరకూ నాలుగు సార్లు జగన్నాధ రథయాత్ర నిర్వహించిన రాజమండ్రి ఇస్కాన్‌ ఇప్పుడు ఐదవ సంవత్సరం మరింత భారీ ఎత్తున రథయాత్ర తలపెట్టిందని ఆయన తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా 40 దేశాల నుంచి, ముఖ్యంగా మయన్మార్‌ నుండి 60మంది గురుకుల పాఠశాల విద్యార్థులు ఈ యాత్రలో హరినామ సంకీర్తన చేస్తారని ఆయన చెప్పారు. ఉభయ గోదావరి, క ష్ణ, విశాఖ జిల్లాల నుంచి వచ్చే 15 రకాల న త్య కళా బ ందాలు, కేరళ నుంచి వచ్చే చండయి మేళాలు, వివిధ విచిత్ర వేష ధారణలతో,మెయిన్‌ రోడ్డు, కోటగుమ్మం,లక్ష్మీవారపు పేట,దేవీచౌక్‌ మీదుగా శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం వరకూ ఈ రథయాత్ర సాగుతుందని ఆయన వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here