తెగిన బంధం

0
45

అక్కడా…ఇక్కడా నలుగురూ ఔట్‌

కేంద్రంలో తెదేపా మంత్రులు…రాష్ట్రంలో బిజెపి మంత్రులు రాజీనామా

అమరావతి, మార్చి 8 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశం చివరికి భారతీయ జనతా పార్టీ,తెలుగుదేశం పార్టీల మిత్ర బంధం తెగతెంపులకు దారి తీసింది. ఏపీకి ప్రత్యేక హోదా, ఆర్ధిక సహాయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న తన ఇద్దరు మంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరిలతో తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం రాజీనామా చేయించగా మిత్రధర్మాన్ని పాటిస్తూ రాష్ట్రంలో బిజెపి మంత్రులు కామినేని శ్రీనివాస్‌, పైడికొండల మాణిక్యాలరావులు కూడా రాజీనామా చేశారు. బుధవారం రాత్రి నుంచి వేగంగా మారిన పరిణామాల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కూడా మంత్రులు కూడా రాజీనామాలు చేయడంతో రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మంత్రులు రాజీనామా చేయడం కాకుండా చంద్రబాబు ఎన్‌డీఏ నుంచి బయటకు రావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ సవాలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here