మాజీ కౌన్సిలర్‌ కృష్ణకుమారి కన్నుమూత

0
51

సీనియర్‌ పాత్రికేయులు భూషణ్‌బాబుకి మాత వియోగం

రాజమహేంద్రవరం, మార్చి 10 : కార్మిక నాయకులు, సిపిఎం నాయకులు, మున్సిపల్‌ మాజీ ఇంచార్జ్‌ చైర్మన్‌ జిఎస్‌ బాలాజీ దాస్‌ సతీమణి, మాజీ కౌన్సిలర్‌ గురువుగారి కృష్ణకుమారి గత సాయంత్రం కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. ఆమెకు ముగ్గురు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు. ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌ పూర్వ అధ్యక్షులు, ఎ.పి.యు.డబ్ల్యు.జె. సీనియర్‌ నాయకులు జి.ఎ.భూషణ్‌ బాబు ఈమె పెద్ద కుమారుడే. సిపిఎం సీనియర్‌ నాయకులు,మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు ఈమె అల్లుడే. గత కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆమె ఈ సాయంత్రం మోరంపూడి సాయినగర్‌ లోని అల్లుని ఇంట తుదిశ్వాస విడిచారు. రాజమండ్రి మున్సిపాలిటీ స్థాయిలో ఉండగా, 1968లో ఒకసారి, 1981లో మరోసారి కౌన్సిలర్‌ గా ఎన్నికైన ఈమె సమర్ధవంతమైన సేవలు అందించారు. ఎన్నో ప్రజా సమస్యలను పరిష్కరించారు. బాలాజీదాస్‌తో కలిపి ఆమె అనేక ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. అధిక ధరలపై ఉద్యమం చేసిన నేపధ్యంలో 1974లో కృష్ణకుమారి జైలుకు వెళ్ళారు. ఆనందనగర్‌, శాటిలైట్‌ సిటీ ప్రాంతాలలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇప్పించడంలో ఆమె ఎంతో క షిచేశారు. కాగా క ష్ణకుమారి అంత్యక్రియలు ఈరోజు ఉదయం ఇన్నీస్‌పేట రోటరీ కైలాసభూమిలో జరిగాయి. కృష్ణకుమారి మరణం పట్ల పలువురు తీవ్ర సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, సీసీసీ చానల్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ పంతం కొండలరావు, పలువురు పాత్రికేయులు, మిత్రులు సన్నిహితులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. కాగా భూషణ్‌ బాబు మాత మూర్తి క ష్ణకుమారి మ తి పట్ల ఏపీయుడబ్ల్యూజె రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు, ఐజేయు ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డి.సోమసుందర్‌, ఉపాధ్యక్షులు మండెల శ్రీరామమూర్తి , జిల్లా అధ్యక్షులు కె.స్వాతిప్రసాద్‌, జిల్లా కార్యదర్శి సుంకర ప్రసాద్‌, ఏపీయుడబ్ల్యూజె జిల్లా ఉపాధ్యక్షులు టి.శ్రీనివాస్‌, సహాయ కార్యదర్శి పాలపర్తి శ్రీనివాస్‌, ఎలక్రానిక్‌ మీడియా జిల్లా గౌరవాధ్యక్షులు కె.పార్థసారధి, ఏపీయుడబ్ల్యూజె జిల్లా పూర్వపు అధ్యక్షులు మేడపాటి శ్రీనివాసరెడ్డి , చిన్న పత్రికల సంఘం నాయకులు డి.రామలింగం, జమ్మా రమేష్‌ రాజా పలువురు పాత్రికేయులు తీవ్ర సంతాపం తెలియజేశారు. భూషణ్‌బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here