14 నుండి కళాకేంద్రంలో నంది నాటకాల ప్రదర్శన

0
48

రాజమహేంద్రవరం, మార్చి 11 : శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఈనెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నంది నాటకోత్సవాలు జరుపుతున్నట్లు పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో నాటక పోటీలు జరుగుతాయన్నారు. చివరి ప్రదర్శనలు ఒక ప్రాంతంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సాంఘిక, పద్య నాటకాలు ప్రదర్శించబడతాయన్నారు. 14వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రదర్శనలు ప్రతిరోజూ రాత్రి 9 గంటల వరకు కొనసాగుతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలనచిత్ర మరియు టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఈ నాటకోత్సవాలను నిర్వహిస్తోందన్నారు. కళాభిమానులు, ప్రజలు నాటక ప్రదర్శనలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 2015 సంవత్సరంలో 22 రోజులపాటు నాటకోత్సవాలను నిర్వహించారని మురళీమోహన్‌ గుర్తు చేశారు. రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే నాటకోత్సవాలను ఎప్పటికప్పుడు ప్రజలు విజయవంతం చేస్తున్నారన్నారు. ప్రదర్శనలకు వచ్చే కళాకారులకు భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. చివరి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారన్నారు. ఎఫ్‌డిసి జనరల్‌ మేనేజర్‌ ఎం.వి.ఎల్‌.ఎన్‌.శేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు తదితరులు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here