చిందేసిన చిన్నారులు

0
53

సందడిగా సాగిన హ్యాపీ సండే

రాజమహేంద్రవరం, మార్చి 11: నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కర్‌ ఘాట్‌ వద్ద ఈ రోజు నిర్వహించిన హ్యాపీ సండేలో చిన్నారులు సందడి చేసారు. చిన్నారులు చక్కని వేషధారణలో అధ్బుతంగా న త్యాలు వేసి అందరిని అలరించారు.నగరపాలక సంస్ధ ప్రత్యేకంగా నియమించిన డాన్స్‌ మాష్టర్‌ సాయి నేత త్వంలో దానవాయిపేట మునిసిపల్‌ స్కూల్‌ విద్యార్ధులు రామ్‌ చరణ్‌ నటిస్తున్న రంగస్థలం టైటిల్‌ సాంగ్‌ కి అధ్బుతంగా వేసి అందరి ప్రసంశలు అందుకున్నారు. నెహ్రూ నగర్‌ ప్రాధమిక పాఠశాల విద్యార్థులు గోపికమ్మ చాలును అనే పాటకు చక్కని వస్త్రధారణతో చక్కగా డాన్స్‌ లు వేసారు.కంటిపూడి రామారావు నగరపాలక సంస్థ, కోటిలింగాల పేట ఆది ఆంధ్రా పాఠశాల,గాంధీపురం-2 నగరపాలక సంస్థ, జైల్‌ వార్డెన్‌ లైన్‌ ప్రాధమిక పాఠశాల, మంగళవారపు పేట ప్రాధమిక పాఠశాల, ఏఆర్‌ బాయ్స్‌ గ్రూప్‌ కి చెందిన డి4 బ ందంతో పాటు భువన, యేసురాజ్‌,కార్త, దుర్గ అధ్బుతంగా న త్యాలు వేసి అందరిని ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గొర్రెల సురేష్‌, మర్రి దుర్గా శ్రీనివాస్‌,స్కూల్స్‌ సూపర్‌ వైజర్‌ దుర్గా ప్రసాద్‌ పాల్గొనగా విశ్రాంత ఉపాధ్యాయులు రాజేష్‌, ఉపాధ్యాయురాలు రమాదేవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here