పోలియో మహమ్మారిని తరిమికొడదాం

0
45

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన ప్రజాప్రతినిధులు

రాజమహేంద్రవరం, మార్చి 11 : పోలియో మహమ్మారిని తరిమికొట్టేందుకు తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మేయర్‌ పంతం రజనీ శేషసాయి పిలుపునిచ్చారు. నగరంలో నిర్వహిస్తున్న పల్స్‌ పోలియో కార్యక్రమంలో భాగంగా నెహ్రూనగర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌లో చిన్నారులకు గోరంట్ల, మేయర్‌ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ బాధ్యత వహించాలని, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు అశ్రద్ధగా ఉండకూడదన్నారు. ఐదేళ్ళలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, టిడిపి నాయకులు జక్కంపూడి అర్జున్‌, టేకుమూడి నాగేశ్వరరావు, దమర్‌సింగ్‌ బ్రహ్మాజీ, దాడి శ్రీను, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here