ఆత్మ విశ్వాసంతో సైనికుల్లా పనిచేద్దాం

0
65

జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే అందరి లక్ష్యం కావాలి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నేతలు

రాజమహేంద్రవరం, మార్చి 12 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు పార్టీ కార్యాలయంలో సిటీ కో-ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ముందుగా పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యో మోషేన్‌రాజు పార్టీ జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి, గ్రేటర్‌ అధ్యక్షులు కందుల దుర్గేష్‌ కేక్‌ కట్‌ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజశేఖరరెడ్డి పాలన విధానాన్ని కార్యకర్తలకు వివరించారు. ప్రతీ కార్యకర్త, పార్టీ నాయకులు సైనికుల్లా పనిచేసి, వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలన్నారు. వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రజాసమస్యలపై స్పందించాలని రౌతు సూచించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీకి కార్యకర్తలందరూ ఆత్మవిశ్వాసంతో పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, పోలు విజయలక్ష్మి, సుంకర చిన్ని, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, గుర్రం గౌతమ్‌, మార్తి లక్ష్మి, కార్పొరేటర్లు ఈతకోట బాపనసుధారాణి, మజ్జి నూకరత్నం, పిల్లినిర్మల, బొంత శ్రీహరి, పెదిరెడ్ల శ్రీనివాస్‌, కాటం రజనీకాంత్‌, కుక్క తాతబ్బాయి, వాకచర్ల కృష్ణ, మాసా రామ్‌జోగ్‌, మజ్జి అప్పారావు, ఉప్పాడ కోటరెడ్డి, మరుకుర్తి కుమార్‌ యాదవ్‌, నీలి ఆనంద్‌, రాఘవులు, సాలా సావిత్రి, రబ్బాని, వివి.కృష్ణారావు, పెంకే సురేష్‌, తామడ సుశీల, వంకాయల సత్తిబాబు, సబ్బరపు సూరిబాబు, కట్టా సూర్యప్రకాష్‌, సంకిస భవాని, గూడాల ఆదిలక్ష్మి, మచ్చా కుమారి, అందనాపల్లి సత్యనారాయణ, డాక్టర్‌ రాజశేఖర్‌, బాషా, షేక్‌మస్తాన్‌, ఎండీ ఆరీఫ్‌ , కుమారి, లక్ష్మి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here