అంతర్జాతీయ సేవాపురస్కారం అందుకున్న కొల్లివెలసి హారిక

0
37

రాజమహేంద్రవరం, మార్చి 12 : బిసి సంక్షేమసంఘం మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి కొల్లివెలసి హారిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా అంతర్జాతీయస్ధాయి సేవాపురస్కారాన్ని విశాఖపట్నంలోని గురజాడకళాక్షేత్రంలో అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్ధ, జె-వరల్డ్‌, వీటీమ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్ధలు సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాయి. దేశ,విదేశాలకు చెందిన 11 మందిని వివిధ రంగాల నుండి ఎంపిక చేసి అవార్డులను అందచేశారు. సేవా రంగంలో అవార్డుకు కొల్లివెలసి హారికను ఎంపిక చేశారు. ఈ అవార్డును సినీనటుడు శరత్‌కుమార్‌, నటుడు నరేష్‌, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, నటి సనా, గాయని కల్పనల చేతుల మీదుగా కొల్లివెలసి హారిక అందుకున్నారు. ఈ సందర్బంగా కొల్లివెలసి హారిక మాట్లాడుతూ ఈ అవార్డును అందుకోవడం ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. మహిళలు వివిధ రంగాల్లో ఎంతగా రాణిస్తున్నప్పటికి రాజకీయాధికారంలో రిజర్వేషన్‌ బిల్లుకు అడ్డంకులు కలుగుతూనేవున్నాయని, ఈ బిల్లు తప్పకుండా చట్ట రూపం దాలుస్తుందనే నమ్మకం వుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలోని మహిళలను గౌరవించాలని, తద్వారా మహిళాభ్యుదయానికి తమ వంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నటి విజయనిర్మలకు ప్రకటించిన జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆమె కుమారుడు నరేష్‌ అందుకున్నారు. సినీనటి రాధిక తరపున జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆమె భర్త శరత్‌కుమార్‌ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సంగీతంలో యుఎస్‌ఎకి చెందిన పద్మిని కచపి, నృత్యరంగంలతో శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన సీతామదభూషి, నటనారంగంలో శ్రీలంకకు చెందిన నటి శామనాలీ ఫోన్సెకా, గాయని కల్పన, విద్యారంగం నుండి గంటా శరణి, టాలీవుడ్‌ డైరెక్టర్‌ జయ, నటి సనా, బుల్లి తెర నటి పల్లవి, యువ సామాజిక కార్యకర్త మేడపురెడ్డి కలశలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డులను ప్రదానం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here