కాంగ్రెస్‌ వస్తేనే ఆంధ్రాకు ప్రత్యేక హొదా సాధ్యం

0
47

కేంద్రంపై కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం : గిడుగు రుద్రరాజు

14న బిజెపి కార్యాలయం వద్ద ఆందోళనలు : పంతం నానాజీ

రాజమహేంద్రరం, మార్చి 12 : కాంగ్రెస్‌ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హొదా సాధ్యమని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక ¬దా కల్పించే అంశంపై కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం పేట్టేందుకు సిద్ధమవుతుందని ఆయన వెల్లడించారు. స్ధానిక ఆనంద్‌ రీజెన్సీలో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ ప్రత్యేక హొదా కోసం కాంగ్రెస్‌ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఇటీవల పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి నేతృత్వంలో ఐదురోజుల పాటు వివిధ తరహాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తమ పోరాటానికి దేశవ్యాప్తంగా ఉన్న యుపిఎ భాగస్వామ్య పార్టీలన్నీ మద్దతు తెలిపాయన్నారు. ఎఐసిసి అధ్యక్షులు రాహుల్‌ గాంధీ ధర్నాకు హాజరై కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హొదాపైనే పెడతామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికే కెవిపి రామచంద్రరావు నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌లోను, తాము పార్లమెంట్‌ వెలుపల పోరాటాలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే ఇప్పటికే రూల్‌ 184 కింద నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. ఆర్ధిక బిల్లుకు సంబంధించి కట్‌మోషన్‌ పెట్టడం జరిగిందన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి గానీ తెలుగుదేశం పార్టీకి గానీ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదని, కాబట్టి కాంగ్రెస్‌పార్టీయే, తన యుపిఎ భాగస్వామ్య పక్షాలను కలుపుకుని అవిశ్వాస తీర్మానం పెట్టడం జరుగుతుందన్నారు. ఎన్‌డిఎ, దాని భాగస్వామ్య పక్షం రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకువెళతామన్నారు. తమ పోరాటానికి ప్రజా సంఘాలు, జెఎసి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, యువజన సంఘాలన్నీ మద్దత్తు ఇవ్వాలని కోరారు. ఏప్రిల్‌ 5 నాటికి బడ్జెట్‌ సమావేశాలు ముగిసిపోతాయని, ఆలోగానే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాయితీలతో కూడిన ప్రత్యేక తరహా ¬దా కల్పిస్తేనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాయితీలతో కూడిన ప్రత్యేక తరహాదా హొదాతో పాటుగా, విభజన హామీలన్నింటిని నెరవేరుస్తుందన్నారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు పంతం నానాజీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక ¬దాకోసం ఢిల్లీలో ఐదురోజుల పాటు ఆందోళనలు నిర్వహించామన్నారు. అలాగే పార్లమెంట్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రధాని మోదీ, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులపై ఫిర్యాదు చేశామని, ఇక్కడ ఫిర్యాదు చేయడం చరిత్రలో తొలిసారేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హొదా కల్పించే అంశాన్ని ఈనెల 16,17,18 తేదీలలో జరిగే కాంగ్రెస్‌ ఫ్లీనరీలో కూడా ఒక ఎజెండాగా పెడుతున్నారని తెలిపారు. ¬దాకోసం పోరాటంలో భాగంగా ఈనెల 14న బిజెపి కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో పిసిసి ప్రధాన కార్యర్శులు ఎస్‌ఎన్‌ రాజా, సోడదాసి మార్టిన్‌ లూధర్‌, కాంగ్రెస్‌ శిక్షణా తరగతులు రాష్ట్ర కమిటీ ఛైర్మన్‌ రామినీడి మురళి, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌వి శ్రీనివాస్‌, కార్యదర్శులు దాసి వెంకట్రావు, ముళ్ళా మాధవ్‌, అబ్దుల్లా షరీఫ్‌, యువజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ఎస్‌ఎకె అర్షద్‌, అంకం గోపి, కార్పొరేటర్‌ రాయుడు సతీష్‌, అసదుల్లా అహ్మద్‌, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బోడా వెంకట్‌, నలబాటి శ్యామ్‌, గోలి రవి, ఆకుల సూర్యభాగ్యలక్ష్మి, నరాల లక్ష్మీ పార్వతి, బాలేపల్లి మురళీధర్‌, కాటం రవి, చాపల చినరాజు, ఎస్‌కె సుభానీ, బబ్లూ, పట్టాబి, మోహిత్‌, సునీల్‌, పిశిపాటి రవీంద్ర శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here