హోదా సాధించే వరకు కాంగ్రెస్‌ నిరంతర పోరు

0
37

రాజమహేంద్రవరం, మార్చి 13: ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుండి 9 వ తేదీ వరకు ఢిల్లీలో వివిధ ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించిందని రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ రాయుడు రాజవల్లి సతీష్‌, కార్పొరేటర్‌ రాయుడు సతీష్‌, అధికార ప్రతినిధి బాలేపల్లి మురళీధర్‌ తెలిపారు. ఈ సందర్భంగా పీసిసి అధికార ప్రతినిధి బాలేపల్లి మురళీధర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఫైల్‌ పైనే తొలిసంతకం చేస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. నియోజకవర్గం ఇన్‌-చార్జ్‌ రాయుడు రాజవల్లి సతీష్‌ మాట్లాడుతూ మొదటనుండి రాష్ట్రానికి ప్రత్యేక హోదాకై కాంగ్రెస్‌ పార్టీయే పోరాటం చేస్తోందని అన్నారు. కార్పొరేటర్‌ రాయుడు సతీష్‌ మాట్లాడుతూ ఈ నెల 16, 17,18 తేదీల్లో ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్యర్వంలో జరగబోయే 84 వ జాతీయ ప్లీనరి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం గ్రామ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ దంగుడు బియ్యం నారాయణ, మస్తాన్‌ వల్లి, రాజాపండు, చిలుకూరి నాగేశ్వరరావు, మాగాపు నూకరాజు, దోమ విజయ్‌ భాస్కర్‌, మొండేటి శివాజి, ముత్యాల బాబు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here