మే 7 నుంచి నన్నయ్య సెట్‌ – 2018

0
54

ఏప్రియల్‌ 14వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

31 కోర్సులకు గోదావరి జిల్లాల్లో 11 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష

రాజమహేంద్రవరం,మార్చి 13 : ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 14 ఆర్ట్స్‌, 17 సైన్స్‌ వెరసి 31 పిజి కోర్సులకు మే 7నుంచి 9వరకూ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు విసి ప్రొఫెసర్‌ ముర్రు ముత్యాలనాయుడు చెప్పారు. ఆర్‌ అండ్‌ బి అతిధి గ హంలో ఈరోజు ఉదయం సెట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జ్యోతిర్మయి,అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ డాక్టర్‌ స్వామి,డాక్టర్‌ దీప్తి, ప్రొ. ఎస్‌. టేకి, ప్రొ. రమేష్‌,డాక్టర్‌ వెంకటేశ్వరరావు, డాక్టర్‌ హైమావతి,డాక్టర్‌ విజయనిర్మల, డాక్టర్‌ సుబ్బారావు,డాక్టర్‌ శ్రీనివాస్‌,డాక్టర్‌ సూర్య రాఘవేంద్రలతో కల్సి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నన్నయ్య సెట్‌ – 2018 ప్రకటన విడుదల చేసారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రియల్‌ 14వ తేదీ లోగా రూ 500(ఎస్టీ /ఎస్సీ /ఫిజికల్‌ హ్యాండికెపెడ్‌ అయితే రూ 300/-) రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లించి యూనివర్సిటీ వెబ్‌ సైట్‌లను సందర్శించి ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఒకవేళ ఏప్రియల్‌ 14వ తేదీ దాటిన పక్షంలో 500 రూపాయల అపరాధ రుసుము చెల్లించి ఏప్రియల్‌ 23లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా రుసుము చెల్లించవచ్చని, ఆన్‌ లైన్‌ విధానంలో తలెత్తే సమస్యలు ఏమైనా ఉంటే ఏప్రియల్‌ 18 నుంచి 24 లోగా పరిష్కరిస్తామన్నారు. ఆర్ట్స్‌ లో 2670,సైన్స్‌ కోర్సుల్లో 3537వెరసి 6వేల205సీట్లకు జరిగే ప్రవేశ పరీక్ష కోసం తూర్పు గోదావరిలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, రంపచోడవరం, పశ్చిమ గోదావరిలో ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం, ఉత్తరాంధ్రలో విశాఖ, శ్రీకాకుళం,విజయనగరం, అలాగే విజయవాడ వెరసి 11 కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు విసి ముత్యాలనాయుడు చెప్పారు. మే 7,8,9 తేదీల్లో ప్రవేశ పరీక్ష అయిన తర్వాత 24 గంటల్లో ఫలితాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు అయన చెప్పారు. జూన్‌ 18 నుంచి క్లాసులు ప్రారంభం కాగలవని ఆయన సూచించారు. ఉపాధి అవకాశాలు గల కోర్సులు ఎక్కువగా పెడుతున్నామని, కెమిస్ట్రీ చదివిన వాళ్లకు ఎక్కువగా ఉద్యోగాలు వస్తున్నందున కెమిస్ట్రీతో కూడిన కోర్సులు ఎక్కువగా రూపొందించామని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here