పేపర్‌మిల్లు కార్మికుల సమస్యలపై 19న సమావేశం

0
36

గోరంట్ల, గన్ని కృష్ణలకు కార్మిక మంత్రి పితాని హామీ

రాజమహేంద్రవరం, మార్చి 12 : ఇంటర్నేషనల్‌ పేపర్‌ మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణను రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా చైర్మన్‌ గన్ని క ష్ణలు అమరావతిలోని సచివాలయంలో కలిసారు. పేపర్‌ కార్మికుల సమస్యలను మంత్రి ద ష్టికి తీసుకువచ్చారు. సమస్యలను ఆలకించిన మంత్రి పితాని ఈ నెల 19న మధ్యాహ్నం మూడు గంటలకు తన కార్యాలయంలో పేపర్‌ మిల్లు యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేస్తానని చెబుతూ ఆ సమావేశానికి గోరంట్ల, గన్ని క ష్ణలను మంత్రి ఆహ్వానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here