సోము వ్యాఖ్యలే నీచంగా ఉన్నాయి

0
59

కులాన్ని అవమానపర్చారంటూ గాండ్ల తెలికుల ఆగ్రహం

రాజమహేంద్రవరం, మార్చి 14 : ప్రధాని మోదీని ఉద్దేశించి నీచ కులం నుంచి వచ్చారంటూ శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు వ్యాఖ్యలు చేయడం పట్ల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో నేడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నరవ గోపాలకృష్ణ మాట్లాడుతూ సోము చేసిన వ్యాఖ్యలు చాలా నీచంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. బిజెపిలో ఎదిగిన సోము అనేక పదవులు పొందారన్నారు. మరింత ఎదగాలనుకుంటే ప్రధాని మోదీని మరో విధంగా పొగడవచ్చునని, కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గాండ్ల తెలికులు అంటే శివుని కులమని, దేశ చరిత్రలో వారికొక స్ధానం ఉందన్నారు. తెలికులు గానుగు ఆడటం ద్వారా తీసిన నూనెనే పూర్వం రాజుల కోటల్లోనూ, దేవాలయాలలోనూ దీపాలు వెలిగించేందుకు వినియోగించేవారన్నారు. తెలికులు సాంప్రదాయబద్దంగా ఉంటారని, బ్రాహ్మణులులాగా జంధ్యం ధరిస్తారని, వారిని బ్రాహ్మణులతో సమానంగా చూస్తారన్నారు. అటువంటిది నీచ కులమంటూ సోము వ్యాఖ్యానించడం ఆయన అహంభావానికి అద్దం పడుతుందన్నారు. ఆయన వ్యాఖ్యలు మొత్తం జాతిని కించపరిచేలా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా వాటి గురించి ప్రస్తావించకుండా పిచ్చిపట్టిన వాడిలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. 13 జిల్లాల్లోని ప్రజలంతా రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఇవ్వాలని ఒకవైపు డిమాండ్‌ చేస్తుంటే సోము వీర్రాజు ఒక్కరే ప్రజాభిప్రాయాన్ని గౌరవించుకుండా ¬దాను వ్యతిరేకిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం నాయకులు మురపాక వీర్రాజు, పట్టణాల జగ్గారావు, పోలుపల్లి శ్రీనివాస్‌, మురపాక రామకృష్ణ, ఉమామహేశ్వరరావు, మురపాక సత్యనారాయణ, గండేపల్లి వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, కెల్లా సంధ్యాదేవి, మురపాక వీరభద్రరావు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here