ప్రత్యేక హొదా మన హక్కు

0
53

భాజాపా కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ఆందోళన

కాంగ్రెస్‌, బిజెపి పోటాపోటీ నినాదాలు

రాజమహేంద్రవరం, మార్చి 14 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హొదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ప్రదేశ్‌ కాంగ్రెస్‌పార్టీ పిలుపులో భాగంగా నగర కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు స్ధానిక గోకవరం బస్టాండ్‌ వద్దగల బిజెపి కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. నగర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఎన్‌వి శ్రీనివాస్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బిజెపి కార్యాలయం వద్దకు చేరుకుని ప్రత్యేక హొదా ఆంధ్రుల హక్కు, ఆంధ్రులను మోసం చేసిన బిజెపి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేసారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, బిజెపి కార్యాలయానికి చేరుకునే సమయానికి అక్కడ ఉన్న బిజెపి నాయకులు కాంగ్రెస్‌ నినాదాలకు ప్రతిస్పందిస్తూ పోటీగా నినాదాలు చేసారు. ఆంధ్రాను మోసం చేసింది కాంగ్రెస్సే, కాంగ్రెస్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేసారు. బిజెపి, కాంగ్రెస్‌ వర్గాల వారు పరస్పరం నినాదాలు చేసుకుంటూ ఎదురుబొదురుగా రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, ఇరుపార్టీల నేతలను అక్కడ నుంచి దూరంగా తరలించారు. ఎన్‌వి శ్రీనివాస్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ నాయకులు దాసి వెంకట్రావు, ఆకుల సూర్యభాగ్యలక్ష్మి, బెజవాడ రంగారావు, కాటం రవి, షహిన్‌షా, గోలి రవి, లోడ అప్పారావు, దాసరి ప్రసాద్‌, రవీంద్రశ్రీనివాస్‌, నలబాటి శ్యామ్‌, నరాల లక్ష్మి పార్వతి, బబ్లూ, కార్యకర్తలు పాల్గొన్నారు. బిజెపి అర్బన్‌ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు, కార్పొరేటర్‌ రేలంగి శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణరావు, తంగెళ్ళ సత్యనారాయణ, నల్లమిల్లి మూలారెడ్డి, కాలెపు సాయిరామ్‌, రాయ్డు వెంకటేశ్వరరావు, కొత్తపల్లి గీత, నిళ్లా ప్రసాద్‌, వెత్సా రామ్‌ప్రసాద్‌, వెత్సా రామలక్ష్మి తదితరులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here