ఏఐసిసి సభ్యునిగా ఎస్‌.ఎన్‌. రాజా

0
40

రాజమహేంద్రవరం, మార్చి 15 : ప్రస్తుతం పిసిసి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎస్‌ ఎన్‌ రాజా ఏఐసిసి సభ్యులుగా నియమితులయ్యారు. గత 25 ఏళ్లుగా పట్టణ స్థాయినుంచి రాష్ట్ర స్థాయివరకూ కాంగ్రెస్‌ పార్టీలో వివిధ పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన రాజా అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ లో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కార్యాలయం గాంధీ భవన్‌ ఇంఛార్జిగా, రాష్ట్ర విభజన తర్వాత ఇందిరా భవన్‌ ఇంఛార్జిగా వ్యవహరించి, పిసిసి అధ్యక్షులుగా, నాయకులకు, కార్యకర్తలకు తలలో నాలుకగా నిలిచారు. ఇప్పుడు విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్‌ ఇంఛార్జిగా వుంటున్నారు. ముఖ్యంగా గత 20 ఏళ్లుగా తెర వెనుక కాంగ్రెస్‌ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర వహిస్తూ ఎన్నో కార్యక్రమాల విజయం వెనుక రాజా తనదైన ముద్రవేశారు. కష్టకాలంలో కూడా పార్టీని అంటిపెట్టుకుని పలు కార్యక్రమాలు రూపకల్పనలో, అమలులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న రాజా ఇప్పుడు ఏఐసిసి సభ్యులుగా నియమితులవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here