వైకాపా నగర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా కట్టా వెంకటేష్‌

0
61

రాజమహేంద్రవరం, మార్చి 27 : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నగర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా కట్టా వెంకటేష్‌ నియమితులయ్యారు. ఈమేరకు నియామక పత్రాన్ని జాంపేట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సిటీ కో-ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు చేతులమీదుగా అందజేశారు. అంతకుముందు కట్టా వెంకటేష్‌ నివాసం నుంచి భారీ స్కూటర్‌ ర్యాలీ నిర్వహించి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇటీవలే వైకాపా నగర బీసీ సెల్‌ అధ్యక్షులుగా నియమితులైన మజ్జి అప్పారావు నేతృత్వంలో ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రౌతు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో బీసీల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి బీసీలే అండగా ఉన్నారని, పార్టీ పదవులు పొందినవారు రానున్న ఎన్నికల్లో జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు కృషిచేయాలన్నారు. నగర అధ్యక్షులు మజ్జి అప్పారావు, నూతనంగా నియమితులైన కట్టా వెంకటేష్‌ మాట్లాడుతూ పార్టీ కో-ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు సలహాలు, సూచనలతో నగరంలోని అన్ని డివిజన్‌ల్లో పర్యటించి పూర్తిస్థాయి కమిటీని నియమిస్తామని, రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా రౌతుతోపాటు ఫ్లోర్‌ లీడర్‌ షర్మిలారెడ్డి, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, ఈతకోట బాపన సుధారాణి, పిల్లి నిర్మల, బొంతా శ్రీహరి, పార్టీ నాయకులు కానుబోయిన సాగర్‌, కాటం రజనీకాంత్‌, పెదిరెడ్ల శ్రీనివాస్‌, కట్టా సూర్యప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here