కుమ్మక్కు రాజకీయాలకు ఇవిగో నిదర్శనాలు

0
46

వైఎస్సార్‌ కాంగ్రెస్‌, జనసేన వైఖరిపై గన్ని కృష్ణ ధ్వజం

రాజమహేంద్రవరం, మార్చి 27 : రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి కేంద్రంపై ఆఖరి పోరాటం చేయాలని భావిస్తున్న తరుణంలో బిజెపితో వైఎస్సార్‌ కాంగ్రెస్‌, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని చెప్పడానికి మరొక నిదర్శనం అవసరం లేదని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ తన పార్టీ ఎంపీలను రాజీనామా చేయాలని ఆదేశించడంతో పాటు మోడీని విమర్శించకుండా చంద్రబాబుపై గురి ఎక్కుపెట్టాలని ప్రబోధించడం వెనుక ఆంతర్యం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ 2 గా ఉన్న విజయ్‌సాయిరెడ్డి ప్రధాని మోడీకి పాదాభివందనం చేయగా ఆయన ఆశీర్వదించడం ద్వారా సమాజానికి ఏం సందేశం ఇవ్వదలిచారో చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా కోసం, తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఓ వైపు పోరాటం చేస్తుంటే వైకాపా నేతలు ఢిల్లీలోని ఉత్తరాది నాయకుడి కాళ్ళ వద్ద ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు క్షమించబోరని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here